బాబు ఇంకో రికార్డుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌

Update: 2016-10-17 17:01 GMT
న‌దుల అనుసంధానం అంటే కేరాఫ్ అడ్ర‌స్ త‌నే అన్న‌ట్లుగా మారిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ క్ర‌మంలో మ‌రో ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చంద్ర‌బాబే ప్ర‌క‌టించారు. పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. గడిచిన 14 రోజుల్లో ఆశించిన స్థాయిలో మట్టి పనులు జరగలేదని - నవంబర్‌ లో పవర్‌ స్టేషన్‌ నిర్మాణానికి టెండర్లు వేస్తామన్నారు. ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని - పోలవరం ప్రాజెక్టు పనులపై అలసత్వం వహించొద్దని స్ప‌ష్టం చేశారు. డిసెంబర్‌లో రాక్‌ఫిల్‌ డ్యాం పనులు ప్రారంభిస్తామని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ప్రాజెక్టు నిర్మాణంపై అలసత్వం వహిస్తే భవిష్యత్‌లో ప్రమాదమవుతుందని బాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డిజైన్లను సీడబ్ల్యూసీ అధికారి ఆయ‌న‌కు అందజేశారు.

గోదావరి – పెన్నా నదుల అనుసంధానానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని చంద్రబాబు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. రెండేళ్లలో తాము చేసిన భగీరథ ప్రయత్నం ఫలిస్తోందని జీడిపల్లి నుంచి గొల్లపల్లికి నీటిని తీసుకెళ్తున్నామని చెప్పారు. గోదావ‌రి-కృష్ణా న‌దుల అనుసంధానంతో ఫ‌లితాలు వ‌స్తున్న‌ట్లే..గోదావ‌రి-పెన్నాతో కూడా రైత‌న్న‌ల జీవితాల్లో వెలుగులు పూస్తాయ‌ని బాబు ధీమా వ్య‌క్తం చేశారు. అందుకే ఈ అనుసంధానికి సిద్ధ‌మ‌యిన‌ట్లు తెలిపారు. తద్వారా మ‌రో అనుసంధానికి సిద్ధమైన‌ట్లు ప్ర‌క‌టించి బాబు త‌న కొత్త ల‌క్ష్యాన్ని ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News