ఆపరేషన్ ఆకర్ష్‌తో పార్టీ బలోపేతం కోసం తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం చేదు అనుభవాలను మిగుల్చుతోందని అంటున్నారు. సైకిల్ సత్తాను చాటుకునే క్రమంలో కొత్తగా చేర్చుకున్న నేతలతో ఇమడలేక తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో సీనియర్లు - మంత్రులు వంటి ఆరు సైతం ఈ ఇంటిపోరును అనుభవించాల్సి వస్తుందనే చర్చ సాగుతోంది.
రాజకీయంగా ప్రత్యర్ధిని ఎదుర్కొనేందుకు ఎన్నికలకు ముందు, తరువాత పలువురు వైఎస్ ఆర్ సీపీ - కాంగ్రెస్ నేతలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీలోకి తీసుకున్నారు. అయితే ఆ నేతలు పూర్వం నుంచి తమ వెంట ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ తెలుగు తమ్ముళ్లను నిర్లక్ష్యం చేస్తుండడంతో పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో వలస నేతలతో ఒరిజినల్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ నేత రాయపాటి సాంబశివరావు ఆయన అనుచర వర్గాన్ని పార్టీలోకి తీసుకున్నారు. రాయపాటి తిరిగి తెలుగుదేశం పక్షాన ఎంపీ కావడంతో ఆయన అనుచరులకే పలు పదవులు దక్కుతున్నాయి. దీంతో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్నా సీనియర్ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. రాయపాటి అనుచరుడు - మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కు ఇటీవల కనీస వేతనాల కమిటీ చైర్మన్ పదవి లభించింది. మరో అనుచరుడు ఎండీ హిదాయత్ కు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. పార్టీ కోసం గుంటూరులో తన జీవితాంతం సేవలందించిన మాజీ ఎంపీ లాల్ జాన్ బాషా సోదరుడు జియాఉద్దీన్ వంటి సీనియర్ నేతలు పార్టీలో ఉండగా వారిని కాదని హిదయత్ కు పదవి అప్పగించడంపై దేశం నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇక ప్రతిపక్ష నేత సొంత జిల్లా కడపలో ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరి నేతలను చంద్రబాబునాయుడు తమ వద్దకు పిలిపించుకుని మాట్లాడినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. తరచూ ఇరు వర్గాలు గొడవలు పడుతూనే ఉన్నాయి. తమను ఇబ్బందులకు గురి చేస్తున్నా రని టీడీపీ కేడర్ పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకున్నప్పటికి సర్దుకుపోవాల్సిందిగా తమ్ముళ్లకు సూచిస్తున్నారే తప్ప వారి సమస్యలను పరిష్కరించడం లేదు.
ప్రతిపక్ష పార్టీ నుంచి జంపింగ్‌లకు బీజం వేసన భూమా నాగిరెడ్డి రాకతో కర్నూలు జిల్లా పాతతరం టీడీపీ నేతలు ఇమడలేకపోతున్నారు. కొన్ని చోట్ల భూమా అనుచరులు తెలుగుదేశం పార్టీ సీనియర్లతో దాడులకు సైతం తెగబడుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు శిల్పాచక్రపాణి రెడ్డి ఈ విషయాన్ని పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు అనంతపురం జిల్లాలో ఎన్నికలకు ముందు పార్టీ తీర్ధం పుచ్చుకున్న మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి సోదరులతో అక్కడి టీడీపీ కేడర్ కు ఏ మాత్రం పొసగడం లేదు. ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై జేసి సోదరులు ఒంటికాలుపై లేస్తుండడంతో పార్టీ నేతలు సహించలేకపోతున్నారు. తాము చెప్పిందే వేదమనే రీతిలో జేసీ సోదరులు వ్యవహరిస్తుండడం టీడీపీ కేడర్‌కు మింగుడు పడడం లేదు. ఈ విషయంలో అధిష్టానానికి మేయర్ స్వరూప వంటి వారు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. విశాఖ జిల్లాలో ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన గంటా శ్రీనివాసరావు ఆ తరువాత పరిణామాల్లో మంత్రి అయినప్పటికి తన వెంట వచ్చిన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను విస్మరిస్తున్నారన్న వాదన ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/