ఏపీలో తనొక్కడే సీనియర్ నని - తనకు తప్ప రాజకీయాలు ఎవరికీ అర్ధం కావని, తాను తప్ప ఏపీకి ఇంకెవరూ మోనార్క్ లేరని పదే పదే చొప్పుకొనే చంద్రబాబు.. ఇప్పడు జగన్ ను చూసి భయపడుతున్నారా? ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారనగానే ఎక్కడా లేని టెన్షన్ పుట్టుకొస్తొందా? జగన్ పాదయాత్ర తన పార్టీకి ఆఖరి యాత్ర అవుతుందని భయపడుతున్నారా? అంటే ఔననే సమధానమే ఇస్తున్నాయి.. తాజాగా కొన్ని సైట్లలో వస్తున్న జగన్ వ్యతిరేక కథనాలు. ఆయా కథనాల్లో వండి వార్చుతున్నదంతా బాబు గారి స్క్రిప్టేనన్న వాదన వినిపిస్తోంది. జగన్ గురించి బాబు కలలో కూడా ఏం ఆలోచిస్తున్నారో ఆ కథనాలు మన కళ్లకు కడుతున్నాయి.
నిజానికి వచ్చే 30 ఏళ్ల పాటు సీఎం సీటును అంటి పెట్టుకుని ఉంటానని, సీఎంగా తానే పర్ ఫెక్ట్ అని ఇటీవల కాలంలో చెప్పుకొంటున్న చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం సన్నగిల్లుతోంది. జనాల్లో వ్యతిరేకత పెరుగుతోందని, నేతలు - ఎమ్మెల్యేలు - అధికారులు ప్రజలను దోచేస్తున్నారని, అవినీతి కోరల్లో చిక్కి రాష్ట్రం అల్లాడిపోతోందని , దీనిని కంట్రోల్ చేయడంలో బాబు పూర్తిగా విఫలం అవుతున్నారని ప్రజలు భావిస్తున్నట్టు బాబుకు కథనాలు అందుతున్నాయి. మరోపక్క జగన్ తన పాదయాత్రతో ప్రజల్లో భరోసా నింపడంతో పాటు మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువస్తానని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే నవరత్నాలు - వైఎస్సార్ కుటుంబం - మిస్డ్ కాల్ వంటి వినూత్న పథకాలతో ముందుకు పోతున్నారు. వచ్చే నెల 2 నుంచి నిర్వహించే ప్రతిష్టాత్మక పాదయాత్రలో వీటిని జనాలకు చేరువ చేయాలని జగన్ రెడీ అవుతున్నారు, దీంతో ఇవన్నీ జనంలోకి వెళ్తే.. తనకు రాజకీయంగా ఇక పుట్టగతులు ఉండవని భావిస్తున్న బాబు.. తన తమ్ముళ్ల చేతుల్లోని సైట్లలో జగన్ కు వ్యతిరేకంగా కథనాలు వండి వార్చేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర అసలు మొదలవుతుందా? జగన్ కు అన్నీ అడ్డంకులే? కోర్టు పర్మిషన్ ఇవ్వదు.. అంటూ అర్ధం పర్థం లేని కథనాలు వస్తున్నాయి. నిజానికి జగన్ కోర్టును అభ్యర్థించారు. ఇది ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
అయినా కూడా కోర్టు అనుమతి ఇవ్వలేదని, కాబట్టి పాదయాత్ర సాగదని బాబు మైండ్ గేమ్ ను ఈ సైట్లు అక్షరాల రూపంలో జనాలమీదకి వదులుతున్నాయి. కానీ, పాదయాత్ర యాత్రంటే.. బాబు మాదిరిగా మధ్యలో ఓ వారం రోజులు రెస్ట్ తీసుకుని చేయాలని జగన్ కానీ, ఆయన తండ్రి వైఎస్ కానీ, ఆయన సోదరి షర్మిల కానీ ఏనాడూ భావించలేదు. అందుకే వైఎస్ - షర్మిల చేసిన పాదయాత్రలు రికార్డులుగా జనాల గుండెల్లో నిలిచిపోయాయి. ఇప్పుడు జగన్ ఇదే బాట పడుతున్నారు. మరి బాబు కుటుంబం నుంచి ఎంత మంది పాదయాత్రలు చేశారు? ఎవరైనా చెప్పగలరా? అధికారం చూసుకుని.. ఎదుటి వారితో మైండ్ గేమ్ ఆడడం ప్రజలను మభ్యపెట్టడమే రాజకీయంగా బాబు ప్రస్తుతం సాధిస్తున్న క్రెడిట్. ప్రజలే దీనిని అర్ధం చేసుకుని సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నది విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది.