బాబుకు వణుకు పుట్టిస్తున్న ‘జగన్ రాజీనామాలు’

Update: 2018-02-15 04:26 GMT
రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కోసం పోరాడుతాం అని.. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా.. తమ పోరాటానికి ప్రభుత్వం స్పందించకపోతే గనుక.. సమావేశాలు ముగియగానే తమ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని జగన్ తేదీ తో సహా ప్రకటించడాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ త్యాగం తమ పార్టీకి - తాము పోరాటాల పేరుతో నడిపిస్తున్న నిధుల ప్రహసనానికి పెద్ద దెబ్బే అని వారు భావిస్తున్నారు. జగన్ చెప్పిన రాజీనామాల భీషణ ప్రతిజ్ఞను బద్నాం చేయడానికి అన్ని మార్గాలను అన్వేషించాలని తెలుగుదేశం వారు కుస్తీలు పడుతున్నారు. దాదాపుగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒకమూల జగన్ రాజీనామాలు పెద్ద డ్రామా అనే ప్రకటనలతో మీడియా ముందుకు రావాలని.. తద్వారా జగన్ మీద ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడకుండా చూడాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే సంగతేంటంటే.. ‘జగన్ రాజీనామాలు’ అనే పాయింటు.. ఆయన పాదయాత్ర ప్రసంగాల ద్వారా త మేరకు ప్రజల్లోకి వెళుతున్నదో గానీ.. ఈ తెలుగుదేశం నాయకులే దానికి బ్రాండ్ అంబాసిడర్ల లాగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారని పలువురు భావిస్తున్నారు.

జగన్ రాజీనామాల వ్యవహారంపై బురద చల్లడానికి చంద్రబాబునాయుడు నాయకుల్ని ప్రత్యేకంగా పురమాయిస్తున్నట్లు కనిపిస్తోంది. బుధవారం నాడు కూడా.. చంద్రబాబుతో భేటీ అయి ఆయన ఇచ్చిన సూచనల్ని గ్రహించి వచ్చిన వెంటనే మంత్రులు సోమిరెడ్డి - అచ్చెన్నాయుడు తదితరులు ప్రెస్ మీట్ పెట్టి.. రాజీనామాలు పెద్ద డ్రామా అంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు. కొత్త విమర్శ ఒక్కటి కూడా లేదు. జగన్ ఎంపీల రాజీనామాల వలన ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సులేదు.. అనే ఊహాజనితమైన భవిష్యత్ పరిణామం నుంచి వాళ్ల విమర్శలు పుడుతున్నాయి. జగన్ త్యాగం ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటే వారికి చాలా మైలేజీ వచ్చేస్తుందనే భయంతో.. తెలుగుదేశం కోటరీ మొత్తం జడుసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

తెలుగుదేశం మంత్రుల ప్రకటనల్లోనే వారు ఎంత డ్రామాలు ఆడుతున్నారో తెలిసిపోతూ ఉంది. కేంద్రం న్యాయం చేయకపోతే.. తమ నిర్ణయం ఏంటో చూపిస్తాం అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఎప్పటిలోగా కేంద్రం న్యాయం చేయాలనే స్పష్టత లేదు. ఇదెంత పెద్ద డ్రామానో ప్రజలు అర్థంచ చేసుకోలేని స్థితిలో ఉండరు. జగన్ నిర్దిష్టమైన డెడ్ లైన్ తో రాజీనామా చేస్తాం అని చెబుతోంటే.. జగన్ మాదిరిగా మాకు డెడ్ లైన్లు ఉండవు.. అంటూ అదేదో ఘనకార్యంలాగా మంత్రులు సిగ్గు విడిచి చెప్పుకుంటున్నారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
Tags:    

Similar News