కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ తో తునిలో నిర్వహించిన ‘కాపు ఐక్యగర్జన’ ఎలాంటి పరిణామాలకు కారణమైందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటన చోటు చేసుకున్న కొద్దిగంటలకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. బాబు మాటల్లోని లోగుట్టును చూస్తే..
బాబు మాట; ‘‘ఒక నేరగాడి వల్లే ఇదంతా జరిగింది. వీళ్లు జీవితంలో మారరు. రాష్ట్ర విభజన తర్వాత ఒకవైపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ.. మరోవైపు పెట్టుబడుల కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు కష్టపడుతున్నా. ఇలాంటి ఘటనలతో వీళ్లేం సందేశం ఇస్తారు? మా రాష్ట్రం ఇంతేనని చెప్తారా? పులివెందులలో ఇలాంటి హింస జరిగితే మామూలే అన్నట్లు ఉండేది. కానీ.. ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో ఇలాంటి సంఘటన జరగటం ఊహకు కూడా అందనిది. వాళ్ల నాన్న ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు? నేను 1994లో హామీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చా. చేసేందుకు కట్టుబడి ఉన్నా. కొంతమంది కాపునేతలు నెల రోజుల క్రితమే నన్ను కలిసి మాట్లాడారు. ఏం చేద్దామని అడిగారు. తొందరపడొద్దన్నారు. కోర్టులు కొట్టేసే జీవోలు వద్దు. కమిషన్ వేసి శాస్త్రీయ పద్ధతిలోనే చేయాలని చెప్పారు. అదే చేస్తున్నా. ఈలోపు రాజకీయ పార్టీల ముసుగులో నేరాలు చేసేవాళ్లుఇలాంటి హింసను ప్రోత్సహిస్తున్నారు. రాజకీయం కోసం ఏమైనా చేస్తారా? నేరాలు.. ఘోరాలు వీరి జీవితంలో ఒక భాగం. ఇదే కాదు గతంలో పట్టిసీమ అప్పుడు ఇలాగే చేయాలని ప్రయత్నించారు. అమరావతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాల్ మనీ పేరిట బెజవాడపై దుష్ర్పచారం చేశారు. అభివృద్ధి కోరుకునే వారు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? కులాలు.. మతాలు.. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి’’
పరమార్ధం; బాబు మాటలు విన్న ఎవరికైనా ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో ఇట్టే అర్థమవుతుంది. తాను టార్గెట్ చేసిన వ్యక్తి పేరును ప్రస్తావించకుండా బాబు ఆచితూచి వ్యవహరించారు. పేరు చెప్పినా.. చెప్పకున్నా.. తాను చెప్పాల్సిన విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. తొందరపడి ఆరోపణలు చేశానన్నట్లుగా కాకుండా.. సంయమనంతో వ్యవహరిస్తూనే తన రాజకీయ ప్రత్యర్థిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
బాబు మాట; ‘‘నేరగాడు ఎప్పుడూ నేరపూరితంగానే ఆలోచిస్తారు. కాపులు క్రమశిక్షణతోనే ఉన్నారు. నేరగాడి ముఠానే ఈ పని చేసింది. కాపుల రిజర్వేషన్ సున్నితమైన అంశం. ఆ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని.. అమాయకుల్ని వాడుకొని విధ్వంసంచేయాలని కుట్ర పన్నారు. రోజు ఈ సామాజిక వర్గం ముసుగులో ఆరాచకం చేశారు. రేపు బీసీల వద్దకు వెళ్లి మళ్లీ ఇలానే చేస్తారు. మీడియా సంస్థల ముసుగులో రాజకీయ పార్టీ ఇదంతా చేసింది. ఒక ఛానల్ ఉదయం నుంచి రెచ్చగొట్టే విధంగా ప్రసారాలుచేసింది. లైవ్ యూనిట్లను పంపింది’’
పరమార్ధం; కాపుగర్జనలో భాగంగా చోటు చేసుకున్న హింసకు కాపులకు సంబంధం లేదన్న విషయాన్ని బాబు స్పష్టం చేసే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తుంది. అదే సమయంలో ఈ అంశంపై స్పందించే అవకాశం ఉన్న బీసీలను తొందరపడొద్దన్న సందేశం ఉంది. కాపు ఐక్యగర్జనలో భాగంగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ అమాయకుల మద్యన ఒక రాజకీయాధినేత పెట్టిన చిచ్చుగా చెప్పే ప్రయత్నం చేశారు.
బాబు మాట; ‘‘అవినతి డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా విరజిమ్మి రౌడీయిజం చేసి హింసకు పాల్పడతారా? శాంతిభద్రతలు చేతుల్లోకి తీసుకొని అమాయకుల్ని రెచ్చగొడతారా? ఈ విషయాలన్నీ ఆ పార్టీ అధినేతకు తెలియవా?’’
పరమార్ధం; కాపుఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ రాజకీయ ప్రేరేపితం.. ఒక ముఖ్యనేత చేసిన పని అన్న విషయాన్ని పదే పదే చెప్పే ప్రయత్నంతో పాటు.. ఆధారాలు లేకుండా పేరు వాడటం.. లేనిపోని రాజకీయ కలకలాన్ని రేపేలా చేయకుండా జాగ్రత్త పడినట్లుగా స్పష్టమవుతుంది.
బాబు మాట; ‘‘తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు నేనెంతో సన్నిహితం. 1994లో కూడా 21 స్థానాలకు 20 చోట్ల టీడీపీని గెలిపించారు. గోదావరి జిల్లాల ప్రజలు సానుకూలంగా ఉంటారు. ఎవరినైనా తిట్టాలన్నా ఒక పద్ధతిలోనే ఉంటారు. అలాంటి జిల్లా ప్రజలకు ఇంతగా విధ్వంసం చేసి.. రైలు తగలబెట్టాలన్న దుర్మార్గపు ఆలోచన రాదు. 25 వాహనాలు పూర్తిగా దహనం చేసి.. ఇద్దరు డీఎస్పీలు.. ముగ్గురు సీఐలు.. ఇద్దరు ఎస్ ఐలు.. 8మంది కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ప్రతి ఒక్కరూ ఇలాంటి నేరగాళ్ల గురించి ఆలోచించాలి. నిఘా విభాగం.. పోలీసు.. మీడియా ఎవరూ ఈ హింస జరుగుతుందని పసిగట్టలేకపోయారు. ఇది కుట్ర కాక మరేంటి? వైఎస్సార్ కాంగ్రెస్.. కాంగ్రెస్ లకు చెందిన మనుషులు ఆరేడు వాహనాల్లో వెళ్లి హింసను ప్రేరేపించారు. పార్టీల ముసుగులో ఇలాంటి హింసను ప్రేరేపించే వాళ్లను పోలీసు నియంత్రణ చేయటమే మార్గం’’
పరమార్ధం; హింసకు కారణం గోదావరి జిల్లా ప్రజలు ఎంతమాత్రంకాదని.. కాపుఐక్యగర్జనకు వచ్చిన వారు కాదన్న విషయాన్ని సుస్పష్టం చేయటంతో పాటు.. జరిగిన హింస మొత్తం రాజకీయ ప్రేరేపితం అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి హింసను పసిగట్టటంలో నిఘా.. పోలీసు వైఫల్యంతో పాటు మీడియాది కూడా అన్న మాటను ప్రస్తావించటం గమనార్హం. ఇలాంటి పరిణామాల మీద తన రియాక్షన్ ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పటంతోపాటు.. తానే చేసేదీ చెప్పేశారు.