ఆశించినది ఒక్కటి.. దక్కుతున్నది వేరొక్కటి! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎడా పెడా విరుచుకుపడిపోతే.. తనకు మించిన పోరాట యోధుడు లేడని భావించి.. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే బృహత్తర బాధ్యతను తన భుజస్కంధాలమీద పెట్టేస్తారని బహుశా రేవంత్ రెడ్డి అనుకుని ఉంటారు. బెజవాడలో పార్టీ అధినేతతో పార్టీ నాయకులంతా సమావేశం కావడానికి వెళ్లినప్పుడు... అందరితో పాటూ సమావేశం ముగిసిన తర్వాత.. ఆయన ఏకాంతంగా చంద్రబాబుతో భేటీ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆ ఏకాంతభేటీలోనూ బహుశా ఇలాంటి కోరికలనే ఆయన వెల్లడించి ఉండవచ్చు. దానికి తోడు ఐవీఆర్ ఎస్ ద్వారా తెలంగాణ అధ్యక్షుడిని ఎన్నిక చేస్తా అని చంద్రబాబు అనగానే.. అందరూ ఇక పగ్గాలు రేవంత్ చేతిలోకే అనుకున్నారు. రేవంత్ కు కిరీటం కట్టబెట్టడానికే చంద్రబాబు.. ఐవీఆర్ ఎస్ మంత్రపఠనం చేస్తున్నారని భావించారు.
కానీ తాజాగా.. పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించబోతున్నారనే పేర్లను పరిశీలించినప్పుడు రేవంత్ దూకుడుకు చంద్రబాబు బ్రేకులు వేయడానికే నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ పార్టీ అధ్యక్షుడుఅయిపోబోతున్నారంటూ పార్టీ లోని ఆయన అనుచర వర్గాలంతా ఇన్నాళ్లుగా సంబరపడిపోతూ ఉంటే.. ఇప్పుడు ఆయన పదవి కార్యనిర్వాహక అధ్యక్ష స్థానానికి పరిమితం అవుతున్నదని తెలుస్తోంది. ఇది చిన్న పదవి కాకపోవచ్చు గానీ.. అంతగా అధికారాలు ఉన్నది కూడా కాదు.
తన ఇష్టారాజ్యంగా చెలరేగడానికి రేవంత్ కు సకలాధికారాలు కట్టబెట్టే పదవి కూడా కాదు. పార్టీకి వేరే గత్యంతరం లేదు గనుక.. తననే నమ్ముకుంటారని.. పార్టీని తాను దూకుడుగా తీసుకువెళ్లగలనని రేవంత్ తలపోసి ఉండవచ్చు. కానీ చంద్రబాబునాయుడు చాలా లౌక్యంగా రేవంత్ దూకుడును వదులుకోవడం ఇష్టం లేకుండానే.. పార్టీకి మెతకదనం ఇమేజి కూడా ఉండేలా.. దూకుడును ఇష్టపడలేని ప్రజలు.. దూరం జరిగే ప్రమాదం ఎదురుకాకుండా కాంబినేషన్ ను సెట్ చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఎల్.రమణను అధ్యక్షుడిగా కొనసాగిస్తూ, రేవంత్ ను తెలంగాణ కమిటీకి కార్యనిర్వాహణ అధ్యక్షుడిగా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అదే ఏపీ తెలుగుదేశానికి కిమిడి కళా వెంకటరావును పేరును అధ్యక్షుడిగా ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తున్నది.