తెలుగుదేశం అధినేత, టెక్నాలజీ ప్రియుడు అయిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. మొదటినుంచి సాంకేతికతకు పెద్దపీట వేసిన చంద్రబాబు పాలనలోనూ వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన పరిపాలన విధానాలను సైతం ఆయన టెక్నాలజీమయం చేశారు. టెక్నాలజీ అందించి సౌలభ్యాలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉండే చంద్రబాబు తాజాగా అదే టెక్నాలజీ వేదికగా తన సత్తా చాటారు.
తన ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనలు, తన పార్టీ వేదికగా చేపడుతున్న కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు పంచుకుంటున్న క్రమంలో ఓ విశిష్ట ప్రత్యేకతను సాధించారు. చంధ్రబాబు అధికారిక ట్విట్టర్ ఖాతా మిలియన్ ఫాలోవర్లను చేరుకొని రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా చంద్రబాబు తన ఆనందాన్ని పంచుకున్నారు. "మిలియన్ ఫాలోవర్లను చేరుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ విజయంలో భాగస్వామ్యులు అయిన వారందరికీ కృతజ్ఞతలు"అని తెలిపారు. బాబు చేసిన ఈ ట్వీట్ కు కూడా భారీ స్పందన రావడం విశేషం. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్లాట్ ఫాం పల్స్ తెలిసిన చంద్రబాబు మిలియన్ ఫాలోవర్లను చేరిన సందర్భంలోనూ హుందాగా స్పందించి పలువురి మనసులను ఆకట్టుకున్నారని కితాబులు దక్కాయి.
ఇదిలాఉండగా చంద్రబాబు కుమారుడు లోకేష్ కు 88, 200 మంది ఫాలోవర్లు ఉండగా...ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు 59,400 మంది అభిమానులు ఉన్నారు. తెలంగాణ మంత్రి, ఆ రాష్ర్ట సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు 55,500 మంది ఫాలోవర్లు ఉన్నారు.