ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనకు ఆయువు పట్టైన ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా సాగుతున్న వివాదాలకు ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎంఓలో వివాదాస్పద, ఆశ్రితపక్షపాతం తీరుపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పలు ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో సేవలందించి పరిపాలన వ్యవస్థలో మంచి పట్టు ఉన్న ఐవైఆర్ కృష్ణారావుకు రాష్ట్ర పరిపాలన నిర్వహణలో అత్యంత కీలకమైన పాత్రను పోషించే సీఎంవో కార్యకలాపాలు వివాదాస్పదం అవుతున్న తీరుపై సునిశితంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితుల్లో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ప్రక్షాళన చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రిని ప్రభావితం చేశాయని తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో వైద్య కుంభకోణం వెలుగులోకి రావడం, దీనికి కారణం సీఎంవోనే అంటూ ఆరోపణలు రావడాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఫైళ్ల వేగం తగ్గడం, వివిధ పథకాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోవడం ముఖ్యమంత్రిని ఆలోచింపజేసేదిగా మారింది. ఇటీవల కాలంలో వెల్లు వెత్తుతున్న పలు ఆరోపణల నేపధ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం. సీఎంఓలో వివిధ ర్యాంకులతో కూడిన స్పెషల్ చీఫ్ సెక్రటరీలు - ప్రిన్సిపల్ సెక్రటరీలు - జాయింట్ సెక్రటరీలు అనేక మంది ఉన్నారు. వీరిలో సగం మందిపై వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయనే సమాచారంతో ముఖ్యమంత్రి ఆ దిశగా దృష్టి సారించారు. ఇప్పటికే ఆయా అధికారులకు ఇచ్చిన విధులలో శాఖల కేటాయింపులను ప్రత్యేకంగా మార్పులు చేర్పులు చేసే అవకా శాలు ఉన్నాయి. ఈ వారంలోనే అధికారుల విషయంలో బాధ్యతలను నిర్దేశించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారని సమాచారం. సన్‌రైజ్ రాష్ట్రంగా ఎదిగేందుకు సీఎంవో కార్యాలయం దర్పణం పట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అనుకున్న లక్ష్యాలన్ని శీఘ్రగతిన పూర్తి కావాలనేది ముఖ్యమంత్రి లక్ష్యంగా మారింది.
తన స్పీడును సీఎంవో కార్యాలయం అందుకోవాలంటే ఆరోపణలకు అవకాశం లేని విధంగా టీమ్‌ను ఎంపిక చేసుకోవాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. సీఆర్డీఏ పరిధిలో భూసేకరణ - ప్రాజెక్టుల టెండర్లు - వంటి అంశాల్లో కూడా ప్రభుత్వ నిర్ణయాలు ముందే లీక్ కావడం, విపక్షాలకు ఆయుధంగా మారడాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో వారం రోజుల్లోనే పరిపాలన వ్యవస్థ ఆరోపణలు లేనిదిగా మార్చడానికి దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు సంకల్పించారు. ఆ క్రమంలోనే తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, కొందరు సీనియర్ మంత్రులతో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నపనిచేసిన వ్యక్తి కీలక కార్యాలయమైన సీఎంవో ప్రక్షాళనపై దుమ్మెత్తి పోసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి నష్ట నివారణకు దిగడం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.