గత కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదా.. తెలంగాణ ప్రభుత్వం మీద పెద్దగా వ్యాఖ్యలు.. విమర్శలు చేయకుండా తన పని తాను అన్నట్లుగా వెళ్లిపోతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి మీద నేరుగా పంచ్ సంధించారు. రాజధాని నిర్మాణంతో పాటు.. ఏపీ ప్రభుత్వ వ్యవహారాలు.. పాలన.. విదేశీ పర్యటనలతో బిజీ..బిజీగా ఉంటున్న ఆయన తెలంగాణ సర్కారు ప్రస్తావన అస్సలు తేవటం లేదు.
తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును.. మీడియా ప్రశ్నించటం.. దీనికి బదులిచ్చే క్రమంలో కేసీఆర్ కు కౌంటర్ పంచ్ వేయటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో విపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసిన తీరుపై బాబు స్పందించారు. అదంతా డ్రామాలో ఒక భాగమని వ్యాఖ్యానించిన ఆయన.. రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ ఒకేధఫా మాఫీ చేయాలన్న డిమాండ్ ను సమర్థించారు.
తెలంగాణ విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఒకే దఫా రుణమాఫీ చేయాలన్న వాదనను.. తన స్పందనతో సమర్థించినట్లుగా చెప్పొచ్చు. అయితే.. రుణమాఫీ వ్యవహారం తనకు చుట్టుకోకుండా ఉండేందుకు.. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమన్న విషయాన్ని ప్రస్తావించిన తీరు చూస్తే.. బాబు కేసీఆర్ కు బాగానే పంచ్ వేశారని చెప్పకతప్పదు. మరి.. బాబు పంచ్ కు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరెలా రియాక్ట్ అవుతారో?