టీడీపీ క్లాసు వాయిదా

Update: 2015-10-26 17:25 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిణామాల‌పై సీరియ‌స్‌గా దృష్టిపెట్ట‌డం, తెలంగాణ నాయ‌కుల‌కు ఒకింత స్వేచ్ఛ ఇచ్చిన నేప‌థ్యంలో ప‌లు విప‌రీత ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక వ్యూహం ఖ‌రారు చేసేందుకు స‌మావేశ‌మయిన తెలంగాణ టీడీపీ అగ్ర‌నేతలు పార్టీ సీనియ‌ర్ల‌మ‌ని కూడా ఆలోచించుకోకుండా ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఐటెంగ‌ర్ల్ అంటూ పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని శాస‌న‌స‌భాప‌క్ష నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు విమ‌ర్శించ‌డం, అది కాస్త ముదిరిన సంగ‌తి తెలిసిందే.

ఇదంతా మీడియాలో చిలువ‌లు ప‌లువ‌లు కావ‌డంతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో భేటీ ఏర్పాటు చేశారు. అయితే రేవంత్‌కు ఏసీబీ కేసు ఉన్నందున ఆయ‌న సోమ‌వారం కాక‌పోవ‌డంతో విజయవాడలో జ‌రిగే భేటీ మంగ‌ళ‌వారానికి వాయిదాప‌డింది. ఇప్ప‌టికే రేవంత్ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. రేవంత్‌ రెడ్డి, దయాకర్‌రావు, తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణల మధ్య ఇటీవల చెలరేగిన విబేధాలు, వరంగల్‌ ఉప ఎన్నికకు సంబంధించి పలు అంశాల‌పై బాబు చర్చించనున్నారు. అయితే పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌పై చంద్ర‌బాబు ఒకింత సీరియ‌స్‌గానే స్పందించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుగుదేశం శ్రేణులు వివ‌రిస్తున్నాయి.
Tags:    

Similar News