ఏపీలో త్వరలో ఏడు కార్పొరేషన్లు - పలు పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉంటాయి.. పార్టీ పరిస్థితి ఏమిటన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిలిజెన్సు వర్గాల ద్వారా సర్వే చేయించుకున్నారు. తన ముఖస్తుతి కోసం కాకుండా వాస్తవ పరిస్థితులు చెప్పాలంటూ వారిని ఆదేశించడంతో వారు క్షేత్ర స్థాయి సమాచారంతో పక్కా సర్వే చేసి సీఎం ముందు ఫైలు పెట్టారట. అది చూసిన చంద్రబాబు ముఖం వాడిపోయిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. రాజధాని ప్రాంతం ఉన్న జిల్లా గుంటూరు సహా పలు చోట్ల గెలుపు అసాధ్యమని ఆ సర్వేలో తేలిందని అంటున్నారు.
గుంటూరులో టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్టు ఇచ్చారట. గుంటూరుతో పాటు కాకినాడలోనూ టీడీపీ పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని… ఈ పరిస్థితిలోఎన్నికలకు వెళ్తే టీడీపీకి ఆ రెండు కార్పొరేషన్లు దక్కడం దాదాపు అసాధ్యమని రిపోర్ట్ తేల్చిందని చెబుతున్నారు. విశాఖలో మాత్రం టీడీపీ - వైసీపీ మధ్య పోటాపోటీగా ఉందని ఇంటెలిజెన్స్ సర్వేలో తేలిందని మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.
అయితే.. పలు ఇతర కార్పొరేషన్లు - మున్సిపాలిటీల్లోనూ పోటీ తీవ్రంగానే ఉన్నా ఇప్పటి నుంచే దృష్టి పెడితే గెలవొచ్చని రిపోర్టులో సూచించినట్లు సమాచారం. కాగా కొద్ది రోజుల క్రితమే ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏమిటన్న దానిపైనా ఇంటెలిజెన్స్ వర్గాలతో చంద్రబాబు సర్వేచేయించారు. అందులో టీడీపీకి ప్రస్తుతం ఎన్నికలు జరిగితే 53 స్థానాలకు మించి రావని తేలింది. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలపై సర్వే కూడా దాదాపు అదే విషయాన్ని చెప్పిందట. దీంతో చంద్రబాబుకు కొత్త టెన్షన్ పట్టుకుందని... వచ్చ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏమవుతుందో అని ఆయన దిగులు చెందుతున్నారని టీడీపీవర్గాల్లో టాక్ నడుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/