మోడీపై ఈగ వాలనివ్వన్నట్లుగా వ్యవహరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్క ముసుగు తీసి పారేస్తున్నారు. నాలుగేళ్లుగా మిత్రుడి హోదాలో రాసుకుపూసుకు తిరిగిన బాబు.. ఇప్పుడు మోడీ తమను ఎంతగా మోసం చేశారో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తన మాటల్ని నమ్ముతారో లేదోనన్న సందేహంలో ఉన్న బాబు.. ఏపీలో మోడీ చెప్పిన మాటల క్లిప్పింగ్ లను చేతబట్టుకొని ఢిల్లీలో పలువురు నేతలకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
విభజన నేపథ్యంలో ఏపీని ఆదుకుంటామని.. హామీ ఇచ్చి తీరతామంటూ మోడీ నోటి నుంచి వచ్చిన మాటలకు సంబంధించిన ఆధారాన్ని అందరికి చూపిస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి జరిగిన నష్టాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించిన మోడీ.. ఈ సందర్భంగా ఏపీని ఆదుకునేందుకు పలు సందర్భాల్లో హామీలు ఇచ్చారు.
వీటికి సంబంధించిన క్లిప్పింగ్స్ ను ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. తాను కలుస్తున్న వారికి మోడీ చేసిన మోసాల్ని వివరిస్తూ.. ఆయన చెప్పిన మాటలు.. ఇచ్చిన హామీల్ని ఎలా విస్మరిస్తున్నారో చూశారా? అంటూ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మోడీకి సంబంధించి బాబు ప్రధానంగా చూపిస్తున్న క్లిప్పింగ్స్ చూస్తే..
1. తిరుపతి సభలో రాజధాని అమరావతిపై ఇచ్చిన హామీని చూపిస్తున్నారు. మోడీ చెప్పిన.. నవ్యాంధ్ర.. భవ్యాంధ్ర.. దివ్యాంధ్రగా మారాలి. ఢిల్లీ చిన్నబోయేలా కొత్త రాజధాని నిర్మించుకోవటానికి మేం సహకరిస్తాం అన్న క్లిప్పింగ్ ను చూపిస్తున్నారు.
2. నెల్లూరు సభలో ఏపీకి రానున్న హోదా గురించి ప్రస్తావిస్తూ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ క్లిప్పింగ్ లో ఏమందంటే.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తోందంటే.. దానికి ఏకైక కారణం.. నెల్లూరు గడ్డపై జన్మించిన వెంకయ్యనాయుడు అన్నట్లు అందులో ఉంది.
3. అమరావతి శంకుస్థాపన సందర్భంగా మాట్లాడిన మోడీ.. ఏపీ అభివృద్ధికి తామెంతగా కట్టుబడి ఉన్నామో చెప్పుకున్నారు. అప్పట్లో మోడీ అన్న మాటల్నే తీసుకుంటే.. అమరావతి సాక్షిగా చెబుతున్నాను.. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తాం.
ఇలా పలు సందర్భాల్లో మోడీ నోటి నుంచి వచ్చిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ను ఢిల్లీలోని పలువురి ఎదుట ప్రదర్శించారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ.. ఇవే వీడియో క్లిప్పులను ప్రదర్శిస్తూ.. మోడీ తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టటం గమనార్హం. కొసమెరుపు ఏమిటంటే.. మోడీ చెప్పిన మాటల క్లిప్పింగ్ లను ప్రదర్శిస్తున్న సమయంలో అక్కడి మీడియా ప్రతినిధులు మోడీ మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుకోవటంగా చెప్పాలి.