టీడీపీ అధినేత, విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గ కేంద్రం కుప్పంలో సోమవారం రాత్రి బస చేశారు. అదేంటీ... తనను 35 ఏళ్లుగా గెలిపిస్తూ వస్తున్న కుప్పం ప్రజల వద్దకు బాబు ఎప్పుడూ వెళ్లలేదా? ఇప్పుడే ఆయన కుప్పం వెళ్లినట్టు, ఇప్పుడే ఆయన అక్కడ బస చేసినట్లుగా వార్తలు రాస్తున్నారంటారా? చంద్రబాబును కుప్పం ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు గానీ... ఎప్పుడో గానీ కుప్పం వైపు చంద్రబాబు దృష్టి సారించడం లేదు. అంతేకాదండోయ్... అసలు కుప్పంలో చంద్రబాబు ఒక రాత్రి బస చేసి చాలా ఏళ్లే అవుతోంది. అంతేనా... విపక్షంలో ఉంటే తప్పించి చంద్రబాబు కుప్పం వైపు చూడటం కూడా లేదు. ఈ మాట కుప్పం ప్రజలనే కాకుండా ఏపీలోని ఎవరిని అడిగినా... చివరకు టీడీపీ కార్యకర్తలను అడిగినా నిజమేనని చెప్పేస్తారు.
అయినా కుప్పం పర్యటనకు వెళ్లిన ప్రతి సారీ అలా వెళ్లడం, ఇలా రావడం మినహా... తనను గెలిపిస్తున్న ప్రజల చెంత చంద్రబాబు ఏనాడు బస చేశారు కాబట్టి. అసలు అక్కడ చంద్రబాబుకు సొంత ఇల్లంటూ ఉంటే కదా... కుప్పంలో చంద్రబాబు బస చేయడానికి? కుప్పం ప్రజలు చంద్రబాబును ఏళ్ల తరబడి గెలిపిస్తూ వస్తున్నా... వారి ఆలనాపాలనా చూసేందుకు, కనీసం వారి సమస్యలను వినేందుకు తాను ఉన్నానని చెప్పే భరోసా ఇచ్చేందుకైనా చంద్రబాబు అక్కడ ఇల్లు కట్టుకోవాలి కదా. ఆ మాటను చంద్రబాబు అసలే పట్టించుకోలేదు కదా. ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ప్రచారం చేయడానికి కుప్పం వెళ్లరు. ఎవరినో ఒకరిని పంపించి పని కానిచ్చేస్తుంటారు. అయినా కూడా కుప్పం ప్రజలు చంద్రబాబును గెలిపిస్తూనే ఉన్నారు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వెళ్లిన చంద్రబాబు... సోమవారం రాత్రి అక్కడే బస చేశారు. సొంత ఇల్లు లేకుండా చంద్రబాబు అక్కడ బస ఎలా చేశారంటారా? అప్పుడెప్పుడో తొలిసారి సీఎం అయిన సందర్భంగా తాను ఎప్పుడైనా అక్కడకు వెళితే బస చేసేందుకు వీలుగా రోడ్లు, భవనాల శాఖ నిధులతో ఓ పెద్ద గెస్ట్ హౌస్ కట్టారు. అది చంద్రబాబు వెళ్లినప్పుడు మాత్రమే తలుపులు తెరచుకుంటుంది. మిగిలిన సమయంలో ఆ గెస్ట్ హౌస్ తలుపులు ఎప్పుడూ మూతబడే ఉంటాయి. ఏపీ ఓ మూలన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే కుప్పం పర్యటనకు చంద్రబాబు తప్పించి మిగిలిన వారెవ్వరూ వెళ్లరు. మిగిలిన పార్టీల నేతలు ఎవరు వెళ్లినా కూడా అక్కడ పర్యటనను ముగించుకుని రాత్రి అయ్యేసరికి చిత్తూరుకో, తిరుపతికో చేరుకుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు పర్యటన, బస పుణ్యమా అని మరోమారు కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ తలుపులు తెరచుకున్నాయి.
అయినా ఇప్పుడు చంద్రబాబు కుప్పం పర్యటనకు ఎందుకు వెళ్లారన్న విషయానికి వస్తే... మొన్నటి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలిచారు గానీ, మెజారిటీ క్రమేణా తగ్గిపోతోంది. చంద్రబాబుపై మొన్న పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి ఎన్నికల ప్రచార సమయంలో అనారోగ్యానికి గురి కావడంతో చంద్రబాబు గట్టెక్కారు గానీ... లేదంటే... మిగిలిన టీడీపీ నేతలకు మాదిరిగానే చంద్రబాబు కూడా ఓడిపోయేవారే. 2014 ఎన్నికల్లోనూ చంద్రబాబు మెజారిటీ తగ్గించిన చంద్రమౌళి టీడీపీలో వణుకు పుట్టించారు. ఈ క్రమంలో ఇకనైనా తాను కుప్పం ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోకపోతే కష్టమేనన్న భావనతోనే చంద్రబాబు తన బస్సు యాత్రలో భాగంగా కుప్పం వెళ్లి... అక్కడ ఓ రాత్రి బస చేశారు. మొత్తంగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో బస చేశారన్న మాట.