ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీకి నష్టం చేకూరుస్తున్న వారిపై కొరఢా ఝలిపించారు. ఇప్పటికే చంద్రబాబు అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. వారంతా నామినేషన్లు వేసేశారు. అయితే టికెట్ దక్కిన అభ్యర్థులంతా ప్రచారం చేస్తుండగా.. టికెట్లు దక్కని వారు మాత్రం పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. కొందరు రెబల్స్ గా కూడా పోటీపడుతున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెబల్స్ వల్ల ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు చీలి టీడీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థులు ఓడిపోయే స్థితికి చేరుతున్నారని గమనించి వారిపై చర్యలకు ఉపక్రమించారు..
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల వేళ పలువురు టీడీపీ రెబల్స్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరి వల్ల టీడీపీ ఓడిపోయే పరిస్థితులున్న నేపథ్యంలో సాహసం చేసి బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వారు మరింతగా కక్షగట్టి పార్టీ అభ్యర్థులను ఓడించే చాన్స్ ఉంటుంది. అయినా బుజ్జగించకుండా వారిపై బాబు సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం.
* చంద్రబాబు సస్సెండ్ చేసిన రెబల్స్ జాబితా ఇదే..
కడప-రాజగోపాల్ రెడ్డి
తాడికొండ -శ్రీనివాసరావు
బద్వేలు - విజయజ్యోతి
మదనపల్లె - బొమ్మనచెర్వు శ్రీరాములు
తంబళ్లపల్లె -మాధవరెడ్డి - విశ్వనాథ రెడ్డి
అవనిగడ్డ - కంఠమనేని రవిశంకర్
గజపతినగరం - కే శ్రీనివాసరావు
రంపచోడవరం -కేపీఆర్ కే ఫణీశ్వరీ