అరే.. రెండు రోజులు వరుస సెలవులు. సెలవుల్లో రెస్ట్ తీసుకున్నారో.. అదే పనిగా ఊళ్లు తిరిగి వచ్చారోకానీ.. మొత్తంగా సోమవారం ఉదయం ఆఫీసులకు బయలుదేరి.. పనుల్లో మునిగిపోతున్న వేళ.. ప్రభుత్వ ఉద్యోగులు తమ పనులు చేయనివ్వకుండా కాన్ఫరెన్స్ పేరుతో గంటల కొద్దీ టైంను కిల్ చేయటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకమైన ఆర్ట్ ఉంది. ఈ మధ్యనే జరిగిన మహానాడులో బాబు కాన్పరెన్స్ లో కారణంగా రాష్ట్రంలో అధికారులు పని చేయటం లేదని.. దయచేసి కాన్పరెన్స్ లు ఆపాలంటూ జేసీ మొత్తుకోవటం.. దానికి స్పందనగా తాను కాన్పెరెన్స్ లు తగ్గిస్తానని బాబు చెప్పటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని 414 రోజుల్లోనే పూర్తి చేయటం ఒక చరిత్రగా అభివర్ణించుకున్న బాబు.. పోలవరం నిర్మాణంలో అనేక కీలక మైలురాళ్లను సాధించినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు. 24 గంటల వ్యవధిలో 11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయటం సరికొత్త రికార్డుగా పేర్కొన్న బాబు.. ఈ విషయంలో గిన్నస్ రికార్డును తిరిగరాయాలన్నారు. పోలవరం గొప్పతనాన్ని.. ప్రభుత్వం సాధించిన విజయాన్ని ఏకరువు పెట్టిన ఆయన.. ఇవే విషయాల్ని ఈ రోజున అన్ని పత్రికలు దాదాపుగా ప్రింట్ చేసిన వైనాన్ని మర్చిపోకూడదు.
పొద్దున్న పేపర్లో కవర్ చేసిన వైనాన్ని.. గంటల వ్యవధిలో కాన్ఫరెన్స్ పెట్టి మరీ అధికారులకు.. సిబ్బందికి వాయించేస్తున్న బాబు తీరు చూస్తే.. పని కంటే కూడా ఎక్కువగా మాట్లాడుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపించక మానదు. పనులు వేగం మంచిదే అయినా.. దాని గురించి ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగా మాట్లాడి చేతల్లో చేసి చూపించాల్సిన అవసరం ఉంది. ఇక.. వర్షాకాలం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి వీక్ మొదట్లోనే భారీ సమీక్ష పేరుతో బాబు కాన్ఫరెన్స్ పుణ్యమా అని పాలనలో వేగం మందగించిందన్న మాట బలంగా వినిపిస్తోంది.