రౌడీలకే రౌడీని నేను - తోకలు కత్తిరిస్తా - చంద్రబాబు

Update: 2019-04-04 16:50 GMT
ఒక సినిమాలో ఎంత అద్భుతమైన కంటెంట్‌ ఉన్నా.. ఆడియన్స్‌ ని మొదటిగా ఎట్రాక్ట్‌ చేసిది మాస్ డైలాగులే. అందుకే.. స్టార్‌ హీరోల దగ్గర నుంచి చోటా మోటా హీరోల వరకు అందరూ మాస్‌ ఆడియన్స్‌ ని మెప్పించడానికి ట్రై చేస్తుంటారు. కొంతమంది డ్యాన్సులతో అలరిస్తే..  ఇంకొంతమంది  పవర్‌ ఫుల్ డైలాగులతో మెప్పిస్తారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవర్‌ ఫుల్‌ మాస్‌ డైలాగులతో ఎన్నికల ప్రచారంలో కేక పుట్టిస్తున్నారు.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో.. రోజుకి ఐదు నియోజకవర్గాలను కవర్‌ చేస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా గురువారం అద్దంకి నియోజకవర్గంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ చెప్తూ ఆడియన్స్‌ తో విజిల్స్ వేయిస్తున్నారు. ఒకాయన చంపడమో - చంపించుకోవడమో అని అంటున్నాడని… చంపేంత సీన్‌ లేదు - చంపించుకునేదీ లేదు, శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాం ఏమనుకుంటున్నారో అంటూ నెల్లూరు అర్బన్‌ నుంచి నారాయణపై పోటీ చేస్తున్న అనిల్‌ కుమార్ యాదవ్‌ కు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీ అన్నవాడు లేకుండా చేస్తానని - రౌడీయిజం చేయాలని ఎవరైనా ముందుకు వస్తే అణచివేస్తానని, తాను రౌడీలకు రౌడీగా ఉంటానని అన్నారు చంద్రబాబు.
           
రాష్ట్రం అభివృద్ధి చేసేందుకు అనునిత్యం కష్టపడుతున్నానన్న చంద్రబాబు.. దానికి ఎవరైనా ఆటంకాలు కలిగించాలని చూస్తే వారి గుండెల్లో నిద్రపోతానని వార్నింగ్‌ ఇచ్చారు. తన దగ్గర రౌడీయిజం చేయడం వైఎస్‌ కే చేతకాలేదని అన్నారు. తన హయాంలో రౌడీల అరాచకాలే లేవని.. వాళ్లందర్ని ఉక్కుపాదంతో తొక్కేసినట్లు గుర్తుచేశారు. 24 బాంబులేసి చంపాలని తనని ప్రయత్నించినా.. ఏడుకొండల వాడి దయతో బతికి బట్టకట్టానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండకూడదని.. ఉంటే వాడి తోకలు కత్తిరిస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చారు చంద్రబాబు. మొత్తానికి మాస్‌ డైలాగ్స్‌ తో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు చంద్రబాబునాయుడు.  
Tags:    

Similar News