గుడివాడ ఈ పేరు ఏపీ రాజకీయాలలో చాలా చాలా కనెక్ట్ అయి ఉంది. గుడివాడను రెండు దశాబ్దాలుగా తనతోనే ఉంచుకుని ఓటమెరుగని వీరుడుగా ఉన్నారు కొడాలి నాని. ఆయన రెండు సార్లు టీడీపీ నుంచి మరో రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. 2024లో సైతం పోటీకి రెడీ గుడివాడమే సవాల్ అంటున్నారు.
కొడాలి నాని పక్కా మాస్ లీడర్. ఆయన భాష ఆయన రాజకీయ శైలి అంతా మాస్ కి బాగా నచ్చుతుంది. అందుకే వారు నానిని తమ వారు అనుకుంటారు. కులం, మతం అన్నింటికీ అతీతంగా నాని గుడివాడలో పేరు సంపాదించారు. అలాంటి నాని వైసీపీ నుంచి మంత్రి కాగానే చంద్రబాబుని టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఆయన ఫ్యామిలీని కూడా ఇరికిస్తూ ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు.
గుడివాడలో నానిని ఓడించాలని అంతకంతకు తమ్ముళ్ళకు కసి పెరిగే విధంగా చేసింది నాని వైఖరే అంటారు. ఆయన మానాన ఆయన ఉంటే టీడీపీ అందరిలాగానే ఆయన్ని చూసేది కానీ ఇపుడు టీడీపీ ఏపీలో గెలిచినా నానిని ఓడించలేకపోతే మాత్రం అంత గెలుపులోనూ నిరాశే అన్న ఫీలింగ్ కి వెళ్లిపోయేలా నాని తయారయ్యారు.
అందువల్ల నానికి ఓడించడం అతి పెద్ద టాస్క్ గా టీడీపీకి ఉంది. దాంతో గుడివాడలో ఎవరిని క్యాండిడేట్ గా దింపాలి అన్నది ఒక వైపు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా తొందరలోనే చంద్రబాబు గుడివాడ వెళ్లబోతున్నారుట. ఆయన జిల్లాల టూర్లలో భాగంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మూడు రోజుల పాటు కలియతిరుగుతారు. ఈ నేపధ్యంలో ఆయన గుడివాడని టచ్ చేస్తారు అని అంటున్నారు.
అదే విధంగా ఆయన మచిలీపట్నం కూడా పర్యటించబోతున్నారు. అక్కడ ఒక రాత్రి కూడా బస చేయనున్నారు. మచిలీపట్నం అంటే మరో మాజీ మంత్రి పేర్ని నానిది. ఆయన తనదైన వెటకారంతో చంద్రబాబు మీద ఎపుడూ సెటైర్లు వేస్తూ ఉంటారు. దాంతో పేర్ని నాని టూ కొడాలి నాని అని డిసైడ్ అయి మరీ బాబు ఈ రెండు నియోజకవర్గాల మీద తనదైన శైలిలో దండయాత్ర చేయబోతున్నారు.
అదే విధంగా ఇద్దరు నానీల రాజకీయ కహానీ ఏంటో కూడా తేల్చబోతున్నారు అని తమ్ముళ్ళు అంటున్నారు. ఇక గుడివాడలో చంద్రబాబు టూర్ అంటేనే చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆసక్తికరంగా కూడా ఉంటుంది. గుడివాడలో బాబు టూర్ ఆయన కొడాలి నాని మీద వేసే సెటైర్లు చేసే విమర్శలు అన్నీ కూడా ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తాయనడంలో సందేహమే లేదు.
ఇక కొడాలి నాని ఇలాకా వెళ్ళి ఆయన మీద కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా ఆయన సైతం రివర్స్ లో అటాక్ ఇస్తారు. దాంతో కొన్ని రోజుల పాటు ఏపీ రాజకీయం మండిపోవడానికి అది కారణం అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికి ఆరు నెలల క్రితమే అంటే జూన్ నెలలోనే మినీ మహానాడు గుడివాడలో నిర్వహించాలని అనుకుని అంతా చేశాక చివరి నిముషంలో వాన కారణంగా అది రద్దు అయింది.
దాంతో అప్పటి నుంచే తమ్ముళ్ళు గుడివాడకు బాబు రావాలని కోరుతున్నారు. ఇన్నాళ్ళకు చంద్రబాబు వారి ముచ్చట తీర్చబోతున్నారు. పైగా కొడాలి నాని మీద కూడా విరుచుకుపడబోతున్నారు. మొత్తానికి చూస్తే గుడివాడలో సవాల్ కి బాబు తయారు అయ్యారు. మరి నాని చూస్తూ ఊరుకుంటారా. ఏం జరుగుతుందో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.