మగధీర.. బాహుబలి లాంటి సినిమాలతో కొత్త కొత్త ప్రపంచాల్ని తెరమీద ఆవిష్కరించాడు రాజమౌళి. అతడి విజన్ ఎంత గొప్పగా.. గ్రాండ్ గా ఉంటుందన్నది ఈ సినిమాను రుజువు చేశాయి. ముఖ్యంగా ‘బాహుబలి’ కోసం మహిష్మతి రాజ్యాన్ని ఆవిష్కరించిన తీరు మొత్తం భారతీయ సినీ పరిశ్రమనే విస్మయానికి గురి చేసింది. ఇప్పుడు అమరావతి కోసం కూడా జక్కన్న విజన్ ను ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.
అమరావతిలోప్రభుత్వ భవనాల సముదాయ ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి పాత్ర ఉండాలని బాబు భావిస్తున్నారు. జక్కన్న సలహాలు తీసుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్..ఇతర అధికారులు హైదరాబాద్ లో రాజమౌళితో ప్రత్యేకంగా సమావేశమై.. గంటకు పైగా ఆయనతో చర్చించారు.
‘బాహుబలి-2’ పూర్తయిన తర్వాత ఇందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానని రాజమౌళి చెప్పినట్లు తెలిసిందే. తెలుగు రాష్ట్రాల సంస్కృతులు.. చారిత్రక అంశాలపై సీఆర్‌డీఏ బృందంతో రాజమౌళి చర్చించాడట. రాజధాని నిర్మాణంలో తనవంతు సహకారం అందిస్తానని.. ఆకృతుల రూపకల్పన కోసం ప్రభుత్వం నియమించే భవన నిర్మాణ శిల్పులకు సలహాలు ఇస్తానని చెప్పినట్టు సమాచారం.