ప్రత్యర్థులు పరుగులు తీస్తున్న వేళ.. అందుకు రెట్టింపు వేగంతో పరుగులు తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టకేలకు ఆ దిశగా ఆలోచనల్ని చేస్తున్నారు టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు. తనకు అడ్డా అయిన కుప్పంలో తనను బద్నాం చేసేందుకు వైసీపీ నేతలు చేస్తున్న దాడులకు సరైన సమాధానాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. తనకు..తెలుగుదేశం పార్టీకి కోట లాంటి కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో మొదలైన ఆపరేషన్.. ఈ మధ్యన జరిగిన పంచాయితీ.. మున్సిపల్ ఎన్నికల్లో సానుకూల ఫలితాల్ని అందుకోవటం తెలిసిందే. అయితే.. వైసీపీ నేతల చేతిలో ఉన్న అధికార బలంతోనే అలా జరిగింది తప్పించి.. ప్రజల్లో చంద్రబాబు మీద ఉన్న పరపతి తగ్గి మాత్రం కాదన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకు షాకిచ్చేలా చేయటంలో కుప్పం కీలక భూమిక పోషించిన నేపథ్యంలో.. ఆ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. దీంతో.. తనను దెబ్బ తీయటానికి కుప్పాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసిన వైనాన్ని గుర్తించిన చంద్రబాబు.. నష్టనివారణ ప్రయత్నాల్ని షురూ చేశారు. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. వైసీపీ నేతల కారణంగా పార్టీకి దూరమైన వర్గాల్ని ఒక దరికి చేర్చటం.. తనకు తిరుగులేని అధిక్యత ఉందన్న విషయాన్ని వచ్చే ఎన్నికల్లో నిరూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే పలుప్రయత్నాలు చేసిన చంద్రబాబు.. తన తాజా పర్యటనలో వచ్చే ఎన్నికల్లో తాను కుప్పం నియోజక వర్గం నుంచే పోటీ చేస్తానని వెల్లడించటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కుప్పంలో తన పరపతిని దెబ్బ తీసేలా చేస్తున్న దుష్పప్రచారం పైనా చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం జరిగిన ప్రచారాన్ని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోని ఆయన.. అందుకు భిన్నంగా ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ.. అందుకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవటం మొదలైనట్లు చెబుతున్నారు.
కుప్పంలో ఏడుసార్లు గెలిచిన చంద్రబాబుకు.. ఈ రోజుకు సొంత ఇల్లు లేదన్న మాట వైసీపీ నేతల నోట తరచూ వస్తుంటుంది. ఈ ప్రచారంతో పాటు.. సొంతిల్లులేని చంద్రబాబు కుప్పం స్థానికుడు ఎందుకు అవుతారు? అంటూ ప్రశ్నించటం కనిపిస్తుంది. ఈ ప్రచారానికి చెక్ పెట్టాలని భావిస్తున్న ఆయన.. కుప్పంలో సొంతింటి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం 1.5 ఎకరాల్లో భూమిని కొనుగోలుచేసి.. భారీ భవంతిని నిర్మించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి ఈ నిర్మాణం పూర్తిచేయటంతో పాటు.. కుప్పం ఎన్నికల ప్రచారాన్ని.. అందుకు తగ్గ ప్లానింగ్ ఈ ఇంటి నుంచే జరిగేలాచేయాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ప్రతి మూడు నెలలకు ఒకసారి.. కుప్పంనియోజకవర్గాన్ని తప్పనిసరిగా సందర్శించాలని.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లుచెబుతున్నారు. ఇప్పటివరకు చంద్రబాబు హైదరాబాద్ లో తప్పించి..ఏపీలో సొంతిల్లు లేదని ప్రచారం చేసే వారికి చెక్ పెట్టే ఆలోచనలో.. బాబు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.