అదో రోడ్డు. జన సంచారం బాగానే ఉండే రోడ్డే అది. అయితే అడవికి కూత వేటు దూరంలో ఉన్న ఆ రోడ్డుకు మధ్యలో ఓ చిరుత హాయిగా, దర్జాగా కూర్చుని ఉంది. ఇంకేముంది అటుగా వెళుతున్న జనం ఆ చిరుతను చూసి బిక్కచచ్చిపోయారు. చిరుతను అదిలించలేరు. కదిలించ లేరు. చిరుత దానికదే లేచి వెళితే గానీ ముందుకు సాగలేని పరిస్థితి. చిరుత ఎప్పుడు కదులుతుందో తెలియదు.. తమ ప్రయాణం ఎప్పుడు ముందుకు కదులుతుందో చెప్పలేని పరిస్థితి. అలాగని చేసేదేమీ లేక.. చిరుత వెళ్లేవరకూ అలాగే ఉండిపోయారు. చాలా సేపటికి చిరుత రోడ్డుపై నుంచి లేచి అడవిలోకి దారి తీయడంతో బతుకు జీవుడా అంటూ జనం కూడా ముందుకు సాగిపోయారు.
ఇదీ నల్లమల అడవులకు కేంద్రంగా ఉన్న కర్నూలు జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన. జిల్లాలోని ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిలో సోమవారం రాత్రి చిరుతపులి బెంబేలెత్తించింది. రహదారి పక్కనే వున్న దుర్గమ్మ గుడికి సమీపంలో తెలుగుగంగ కాల్వ వంతెన దాటగానే వున్న రహదారిపై చిరుత హాయిగా కూర్చుని వుంది. ఆ సమయంలో కారులో వెళ్తున్న కొందరికి రోడ్డుకి అడ్డంగా కూర్చుని వున్న చిరుత కనబడటంతో దూరంగా కారు ఆపి అలానే వుండిపోయారు. కొంతసేపటికి ఆ చిరుత తిరిగి అడవిలోకి వెళ్లిపోగానే ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఇదే చిరుత పలుమార్లు ఇలా సంచరించిందని కొంతమంది అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.