విమర్శలు చేయటం తప్పు లేదు. కానీ.. పోలిక పోల్చేటప్పుడు కాస్త వెనుకా ముందు చూసుకోకపోతే అభాసుపాలు కావటం ఖాయం. ఆ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ లో మాట్లాడిన చెవిరెడ్డి.. ఏపీలో మహిళలు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
తప్పు చేసిన వారిని శిక్షించకుండా.. తమ పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డ చెవిరెడ్డి.. ఏపీని ఆఫ్ఘనిస్తాన్ గా తయారు చేస్తున్నారంటూ చెలరేగిపోయారు. ఏపీ ఆఫ్ఘనిస్తానా? అన్నది ఎప్పటి నుంచి అన్న ప్రశ్న మదిలో మెదిలేసరికి చెవిరెడ్డి చెప్పటం షురూ చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ముఠాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇంటెలిజెన్స్ డీజీలు ఫోటోలు దిగటాన్ని ప్రస్తావిస్తారు. ఒకవేళ చెవిరెడ్డి మాటలే నిజం అనుకుందాం. ఒకవేళ కాల్ మనీ నిందితులతో సీఎం ఫోటోలు దిగితే ఏపీ అఫ్ఘనిస్తాన్ అయిపోతుందా?
అయినా.. కాల్ మనీ కాలనాగు బెజవాడలోనే కానీ.. మిగిలినజిల్లాల్లో లేదు కదా? అయితే.. బెజవాడ అఫ్ఘనిస్తాన్ అంటే సరిపెట్టుకోవచ్చు. కానీ.. అదేమీ లేకుండా ఏపీ మొత్తానికి ముద్రేయటం ఏమిటి? కొసమెరుపేమంటే.. ఏపీ కాస్త ఆఫ్ఘనిస్తాన్ అయిపోయిందని వేదన చెందుతున్న చెవిరెడ్డి.. కొద్ది రోజుల క్రితమే రేణిగుంట విమానాశ్రయమంలో ఎయిర్ ఇండియా మేనేజర్ మీద చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో తన పార్టీ ఎంపీ మిధున్ రెడ్డి తో కలిసి.. చెవిరెడ్డి ఎంతగా చెలరేగిపోయారో ఇటీవల విడుదలైన సీసీ కెమేరాల ఫుటేజ్ చెప్పకనే చెప్పేస్తుంది. ఈ వీడియో చూస్తే చాలు.. ఎవరు ఏపీని ఆఫ్ఘనిస్తాన్ లా మారుస్తుందో తెలుసుకోవచ్చు.