విద్యాధికుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉంది. యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ కు విరుగుడుగా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ఉపయోగానికి దేశంలోని రెండు ఫార్మాకంపెనీలు భారత్ బయోటెక్, సీరమ్ కంపెనీల ఆధ్వర్యంలో వ్యాక్సిన్ రెడీ అవుతోంది.
జనాలకు వ్యాక్సిన్ ఇవ్వటానికి కంపెనీలకు కేంద్రప్రభుత్వం అన్నీ అనుమతులు ఇఛ్చేసింది. ఈనెలాఖరులోగా వ్యాక్సిన్ వినియోగం మొదలు కాబోతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో అఖిలేష్ విచిత్రమైన ప్రకటన చేశారు. తొందరలో వినియోగంలోకి రాబోతున్న వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ కాదట బీజేపీ వ్యాక్సినట. కరోనా వ్యాక్సిన్ తయారుచేయటానికి కేంద్రప్రభుత్వంతో పాటు ఫార్మాకంపెనీలు ఎంత అవస్తలు పడుతున్నాయో అందరు చూస్తున్నదే.
విదేశాల్లోని ఫార్మాకంపెనీలతో జతకట్టి దేశీయ కంపెనీలు వ్యాక్సిన్ ప్రయోగాల్లోను, తయారీకి 24 గంటలూ పనిచేస్తున్నారు. అన్నీ పరిస్దితులు అనుకూలిస్తే ఈనెలాఖరుకు వినియోగంలోకి రాబోతోంది. ఇటువంటి సమయంలో అఖిలేష్ వితండ వాదం ఎందుకు మొదలుపెట్టారో ఎవరికీ అర్ధం కావటం లేదు. వ్యాక్సిన్ లో బీజేపీ వ్యాక్సిన్ అని కాంగ్రెస్ వ్యాక్సిన్ అని ఎక్కడైనా ఉంటుందా ?
రాష్ట్రంలో ఎవరు వ్యాక్సిన్ వేసుకోవద్దని తాము అధికారంలోకి రాగానే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తామని మాజీ సీఎం ఓ విచిత్రమైన ప్రకటన చేశారు. సమాజ్ వాదీపార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది ? వ్యాక్సిన్ ఎప్పుడు వేయిస్తుంది ? అప్పటి వరకు జనాలు కరోనా మహమ్మారికి బలవ్వాల్సిందేనా ? సమాజహితం కోరే వ్యక్తి ఇటువంటి ప్రకటనలు చేయవచ్చా ? విచిత్రమేమిటంటే అఖిలేష్ ఇంజనీరింగ్ పట్టబధ్రుడు. అందులోను ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసొచ్చారు. ఇంత ఉన్నత చదవులు చదివిన వ్యక్తి కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడితే ఇక మిగిలిన జనాల సంగతి చెప్పేదేముంది ?