కన్నడ నాట రాజకీయం రసవత్తరంగానే సాగుతోంది. ఇప్పుడే కాదు... ఎప్పుడైనా కన్నడనాట రాజకీయం రంజుగానే సాగుతోందని చెప్పాలి. అక్కడ పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడితే తప్పించి... రాజకీయంగా స్థిరత్వం ఉండదన్న మాట ఎప్పుడో తేలిపోయింది. ఒక్కోసారి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు కూడా సొంతింటి గోల కారణంగా కూలిపోయిన సందర్భాలూ లేకపోలేదనుకోండి. తాజాగా ఇప్పుడు కన్నడ నాట కొనసాగుతున్నది సంకీర్ణ సర్కారే కదా. కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఉన్నా... మెజారిటీ లేని కారణంగా కింగ్ మేకర్ అవుతాడునుకున్న జేడీఎస్ నేత కుమారస్వామిని సీఎం పోస్టుపై కూర్చెట్టి... కాంగ్రెస్ - జేడీఎస్ కూటమికి ప్రాణం పోసింది.
అయితే ఈ ప్రాణం ఎంతకాలం కొనసాగుతుందన్న విషయంపై ఆది నుంచి డౌట్లు ఉన్నా... ఎప్పటికప్పుడు వాటిని అధిగమిస్తూ కుమారస్వామి కొనసాగుతున్నారు. తాజాగా మరోమారు కన్నడ రాజకీయాల్లో పెను కలకలం రేపేలా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ రాష్ట్ర ఎమ్మెల్యే సుధాకర్ (చిక్ బళ్లాపుర్) బాంబులాంటి వార్త పేల్చారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మళ్ళీ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయని సుధాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉలిక్కిపడిందనే చెప్పాలి. మే 23వ తేదీ తరువాత కర్ణాటకతో పాటు దేశంలో రాజకీయ సమీకరణలు మారిపోతాయని చెప్పిన సుధాకర్... ఇలాంటి సమయంలో కర్ణాటకలో అత్యుత్తమ ప్రభుత్వం ఉండవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయితేనే బలమైన ప్రభుత్వం ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసిందన్న విషయాన్ని గుర్తు చేస్తూనే... కుమారస్వామి నాయకత్వంలోనే తాము పని చేస్తున్నామని సుధాకర్ చెప్పు్కొచ్చారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను మార్చితే తాము అందుకు మద్దతు ఇస్తామని, కొత్త ముఖ్యమంత్రితో కలిసి తాము పని చేస్తామని సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి ఉన్న మాట వాస్తవమే అని సుధాకర్ అన్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం సక్రమంగా ముందుకు సాగడం లేదని సుధాకర్ మరో బాంబు పేల్చారు. మొత్తంగా కుమార మరోమారు అలర్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది.