చైనాలో ఆ నగరాలకు సీల్ వేశారు

Update: 2020-01-27 05:43 GMT
హాలీవుడ్ సినిమాల్లో తరచూ రీల్ సీన్.. రియల్ గా మారింది. ఏదో ఒక భారీ ఉపద్రవం భూమి మీద ఉన్న అమెరికా లేదంటే యూరప్ దేశాల మీద పడటం.. అక్కడికి హీరోలు వెళ్లి పరిష్కరించి రావటం తెలిసిందే. ఈ క్రమం లో భారీ నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి సీన్లు చూసిన ప్రతిసారీ వెండితెర మీదనే తప్పించి.. రియల్ గా ఇలాంటివి కనిపించని పరిస్థితి. ఇప్పుడా లోటు తీరి పోయినట్లే.

చైనాకు భయం చలి పుట్టేలా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. చూస్తున్నంతనే అది చైనాలోని కొన్ని ఫ్రావిన్స్ లను చుట్టేసింది. ఇప్పుడీ మాయదారి వైరస్ పడగ నీడలో దాదాపు 1.10 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ రెండు వేలకు పైగా ప్రజలకు కరోనా వైరస్ సోకగా.. దాదాపు అరవై మంది వరకూ మరణాలు చోటుచేసుకున్నాయి.

కరోనా వైరస్ కు జన్మస్థలిగా చెప్పే వుహాన్ నగరంతోపాటు చైనాలోని మరో పన్నెండు నగరాల్లోనూ ఈ వైరస్ బెడద ఎక్కువ గా ఉంది. ఈ వైరస్ వీరి నుంచి ఇతర ప్రాంతాలకు పాకకుండా ఉండేందుకు వీలుగా తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంది చైనా ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న పన్నెండు నగరాలకు చెందిన 1.10 కోట్ల మంది వారి వారి ఊళ్లు దాటకుండా.. ఊళ్లకు సీలు వేశారు.

అంటే.. రవాణా ను పూర్తిగా మూసి వేయటంతో పాటు.. ఆ నగరాల్లోకి బయట ప్రపంచంలోని వారు వెళ్లటం.. బయట ప్రపంచం వారు ఆ నగరాల్లోకి వెళ్లేందుకు ఏ మాత్రం వీల్లేని పరిస్థితుల్ని కల్పించారు.చైనాలోని పన్నెండు నగరాలకు పూర్తిగా సీల్ వేయటమే కాదు.. ప్రజలతో సహా అన్ని రకాల రాకపోకల్ని బంద్ చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అయినా కరోనా వైరస్ కట్టడి అవుతుందా? అన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News