అతి త్వరలో అధ్యక్ష పీఠం ఎక్కకముందే చైనాకు ట్రంప్ వార్నింగిస్తుంటే.. మరోవైపు అంతే దీటుగా బదులిస్తోంది కమ్యూనిస్టు దేశం. దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మిస్తున్న కృత్రిమ దీవులను అడ్డుకుంటామని ట్రంప్ టీమ్ లో విదేశాంగ మంత్రిగా ఉన్న రెక్స్ టిల్లర్ సన్ గురువారం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌ను చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ తిప్పికొట్టింది. అది జరగాలంటే అమెరికా పెద్ద యుద్ధమే చేయాలి అంటూ కవ్వించే ప్రయత్నం చేసింది. ప్రత్యర్థులకు చైనా ప్రభుత్వం కంటే దీటుగా, కరకుగా బదులిచ్చే అలవాటు ఉన్న గ్లోబల్ టైమ్స్ పత్రిక.. దక్షిణ చైనా సముద్ర విషయంలోనూ అలాగే స్పందించింది. అగ్రరాజ్యం అమెరికాతో సై అంటే సై అంటోంది చైనా.
గ్లోబల్ టైమ్స్ తన తాజా కథనంలో ఘాటు హెచ్చరికలు చేస్తూ ఓ అణుశక్తి రాజ్యాన్ని దాని ప్రాంతాల నుంచే తరిమేయాలంటే మీ శక్తి ఎంతో ముందు బేరీజు వేసుకోవాలని టిల్లర్ సన్ కు సూచించింది. అసలు ట్రంప్ కేబినెట్ లో టిల్లర్ సన్ ఉంటారో ఉండరో తెలియదని, కాంగ్రెస్ ఆయనను వీటో చేసేస్తుందని ఆ పత్రిక అభిప్రాయపడింది. అసలు చైనాకు వ్యతిరేకంగా మాట్లాడి సెనేటర్ల మద్దతుతో కేబినెట్‌లో స్థానం సంపాదించడానికే టిల్లర్‌సన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారేమో అన్న అనుమానం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆర్టికలే ఈ పత్రిక చైనీస్ వెబ్ సైట్ లోనూ పోస్ట్ చేయగా.. వేల కొద్దీ హిట్స్ వస్తున్నాయి. చైనాకు అడ్డుకోవడంలో న్యాయపరమైన చిక్కులు కూడా అమెరికాకు ఉంటాయని ఆ పత్రిక స్పష్టంచేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుకు విరుద్ధంగా ఏడాదికి 5 లక్షల కోట్ల వాణిజ్యం ఉండే దక్షిణ చైనా సముద్రంపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని చైనా వాదిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/