క్ష‌మించ‌లేనంత త‌ప్పు చేసిన చైనా

Update: 2017-08-26 06:47 GMT
దుర్మార్గ బుద్ధికి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంది చైనా.  డోక్లాం ఎపిసోడ్ త‌ర్వాత త‌న దుష్ట‌త్వాన్ని మ‌రింత పెంచిన డ్రాగ‌న్‌.. ఏదో ర‌కంగా భార‌త్ ను దెబ్బ తీయాల‌ని కుత‌కుత‌లాడుతోంది. భార‌త్ ను రెచ్చ‌గొట్టేందుకు తాను ఎంత‌కైనా దిగ‌జార‌తాన‌న్న వైనాన్ని తాజా ఉదంతంతో మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

భార‌తీయులు ఎంతో గౌర‌వంగా చూసుకునే జాతీయ జెండాను బూట్ల డ‌బ్బాల‌పై ముద్రించిన వైనం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి.. భార‌తీయులు ర‌గిలిపోయేలా చేస్తోంది. చైనా దిగ‌జారుడుత‌న‌నానికి నిలువెట‌ద్దం లాంటి ఉదంతం ఉత్త‌రాఖండ్ అల్మోరాలో వెలుగు చూసింది.

చైనా నుంచి ప‌లు ఉత్ప‌త్తులు భార‌త్‌ కు రావ‌టం మామూలే. తాజాగా వ‌చ్చిన బూట్ల పెట్ట‌ల మీద భార‌త జాతీయ ప‌తాకాన్ని ముద్రించిన బొమ్మ‌లున్న పెట్ట‌లు వ‌చ్చాయి. వీటిని చూసిన దుకాణ‌దారుడు వెంటనే పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. డోక్లాం ఉదంతం నేప‌థ్యంలో భార‌తీయుల మ‌నోభావాల్ని దెబ్బ తీయాల‌న్న దుష్ట ఆలోచ‌న‌తోనే తాజా కుట్ర‌కు తెర తీసిన‌ట్లుగా భావిస్తున్నారు.

త‌న‌కు వ‌చ్చిన బూట్ల పెట్ట‌ల పైనా భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం బొమ్మ వేసి ఉండ‌టాన్ని గుర్తించిన దుకాణ‌దారు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ ఉదంతంపై అల్మోరా సీనియ‌ర్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ రేణుకా దేవి స్పందిస్తూ.. దుకాణ‌దారు ఇచ్చిన ఫిర్యాదుపై ద‌ర్యాప్తు మొద‌లెట్టిన‌ట్లు చెప్పారు.

 స‌ద‌రు దుకాణ‌దారుడికి ఈ పెట్టెల్ని స‌ప్లై చేసిన రుద్ర‌పూర్ లోని త‌మ్మ‌న ట్రేడ‌ర్స్ నుంచి వ‌చ్చిన‌ట్లుగా గుర్తించారు. ఈ ఉదంతంపై వారిని ప్ర‌శ్నించ‌గా.. త‌మ‌కు దీనికి సంబంధించిన స‌మాచారం ఏమీ తెలీద‌ని.. తాము న్యూఢిల్లీ లోని  హోల్ సేల‌ర్ నుంచి తెప్పించామ‌ని.. వారు ఎక్క‌డ ఉంటారో త‌మ‌కు తెలీద‌న్నారు.  

అయితే.. న్యూఢిల్లీ స‌ర‌ఫ‌రాదారుడి వివ‌రాలు సేక‌రించి అత‌న్ని ప్ర‌శ్నిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పెట్టెలు చైనా నుంచి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం అంద‌టంతో అలెర్ట్ అయ్యారు. డోక్లామ్ వివాదంలో భార‌తీయుల మ‌నోభావాల్ని దెబ్బ తీసేందుకు చైనా వేసిన ఎత్తుగ‌డ‌గా భావిస్తున్నారు.  త‌మ‌కు వ‌చ్చిన స్టాక్ లో ఏడు జ‌త‌ల బూట్లు సాధార‌ణ పెట్టెల్లో ఉన్నాయ‌ని.. మ‌రికొన్ని మాత్రం మూడు రంగుల బాక్సుల్లో ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ఉదంతంపై దృష్టి పెట్టారు. దీనికి కార‌ణ‌మైన వారిని అదుపులోకి తీసుకుంటామ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News