మాజీ ప్రియుడిపై ఉల్లిపాయలతో యువతి ప్రతీకారం

Update: 2020-05-21 15:30 GMT
ప్రేమించడం ఈ కాలంలో చాలా కష్టం.. కానీ విడిపోవడం క్షణాల్లో పని.. చిన్నపాటి గొడవ.. మనస్పర్థ చాలు ఇద్దరి జంటను విడగొట్టడానికి.. అయితే ప్రాణంగా ప్రేమించిన యువకుడు బ్రేకప్ చెప్పడాన్ని ఆ యువతి తట్టుకోలేకపోయింది. రెండు మూడు రోజులు ఏడుస్తూనే ఉంది. అతడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. అప్పుడే వచ్చింది ఈ ఉల్లిపాయల ఐడియా..

చైనాకు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలు జావోకు  ఇటీవలే బ్రేకప్ చేశాడు. దీంతో జావో ఎలాగైనా సరే అతడికి గుణపాఠం చెప్పాలని.. తాను ఏడ్చినట్టే అతడు ఏడ్వాలని ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది.వెంటనే  జిబోలోని అతడి ఇంటి ముందర ఒక టన్ను ఉల్లిపాయలను డంప్ చేసింది. ఓ లేఖను సైతం వదిలివెళ్లింది. ‘నేను మూడు రోజులుగా నువ్వు బ్రేకప్ చెప్పడంతో ఏడుస్తున్నానని.. నువ్వు ఏడువు’ అంటూ లేఖలో రాసింది. ఇక చుట్టుపక్కల వారిని కూడా అతడి ఇంటి ముందు ఉల్లిపాయలు వేయాలని కోరింది.

ప్రియుడి ఇంటి ముందు కుప్పలుగా ఉల్లిపాయలను చూసి స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది. బ్యాయ్ ఫ్రెండ్ బాగోతం అందరికీ తెలిసింది.

దీంతో సదురు బాయ్ ఫ్రెండ్ స్పందించాడు. ఆమె ఎప్పుడు తన మాటపైనే ఉండాలని తనపై అజమాయిషీ చేస్తుంటుందని.. అందుకే బ్రేకప్ చెప్పానని.. నాటకాలు ఆడుతుందని.. ఆమె ఏడ్చినా నేడు ఏడ్వడం లేదని చెబుతోంది. ఏడవకపోతే మనిషిని కాదా’ అంటూ అతడు ప్రశ్నించాడు.

ఉల్లిపాయల ఘాటుతో తన ప్రియుడికి కూడా కన్నీళ్లు రావాలనే ప్రియురాలు ఇలా చేసి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రియురాలు పోతే ఏడ్వని ప్రియుడు ఈ ఉల్లిపాయలతో ఏడుస్తాడా అని కౌంటర్ ఇస్తున్నారు.
Tags:    

Similar News