త్రిదండి చినజీయర్ స్వామి తల్లి అలివేలుమంగ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యం తో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో చినజీయర్ స్వామి తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. తల్లి మరణాన్ని స్వామి తట్టుకోలేకపోతున్నారు. వయసు ఎక్కువ కావడంతో ఆమె అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. మాతృమూర్తి మరణంతో త్రిదండి చినజీయర్ స్వామి విషాదంలో మునిగిపోయారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమం సమీపంలో అలివేలుమంగ అంత్యక్రియలు జరగనున్నాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి మంగతాయారు అంటే ఎంతో ప్రేమాభిమానాలు కలిగివుండేవారు చినజీయర్ స్వామి. ఆమె పరమపదించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. తల్లితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.