ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులపై ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి స్పందించారు.దీనిపై ధర్మ జాగరణ చేసే పెద్దలను కలిసి ఏం చేయాలో ఆలోచిస్తామని అన్నారు.
ఏపీలోని దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని చినజీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికీ 50కి పైగా సంఘటనలు జరిగాయని అన్నారు.
ధనుర్మాస ఉత్సవాల అనంతరం 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని చినజీయర్ స్వామి తెలిపారు. ఆలయాల ఉనికికే భంగం కలిగించే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మేం మౌనంగా ఉండలేమని స్పష్టం చేశారు.
ఏపీలో దాడులు ఎవరు చేస్తున్నారనేది అప్రస్తుతమని.. కానీ పునరావృతం కాకుండా చూడాలని స్వామీజీ అన్నారు. దాడులకు గురైన ఆలయాలను సందర్శించి స్థానికుల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. జరగిన సంఘటనలకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.