‘కల్లుతాగిన కోతి’ ఎవరైనా అతిగా ప్రవర్తిస్తుంటే ఇటువంటి సామెతను వాడుతుంటారు. అయితే తాజాగా టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఓ కోతి మెదడులో చిప్ పెట్టాడు. ఆ కోతి అచ్చం మనిషిలాగే ప్రవర్తిస్తున్నదని మస్క్ అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.చిప్ పెట్టిన కోతి అచ్చం మనిషిలాగే.. వీడియో గేమ్ ఆడుతున్నది. అంతేకాక ఓ అరటిపండును కూడా తింటున్నది. తొక్క తీసుకొని అది అరటిపండును తింటుంటే చూసిన వాళ్లందరికీ ఎంతో కన్నుల విందుగా ఉంది.
టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ 2016లో.. న్యూరాలింక్ (Neuralink) అనే బ్రెయిన్ చిప్ స్టార్టప్ ప్రారంభించారు. అయితే ఈ స్టార్టప్ కంపెనీ ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. త్వరలోనే ఈ చిప్ త్వరలోనే మనుషుల మీద ప్రయోగిస్తామని ఎలాన్ మస్క్ అంటున్నారు. ఒకవేళ పక్షవాతం వచ్చిన మనిషికి ఈ చిప్‌ను పెడితే వాళ్లు మామూలు మనుషుల్లాగా మారే అవకాశం ఉందని ఎలన్ మస్క్ అంటున్నారు.
ఈ కంపెనీ ఆవిష్కరించిన పాంగ్ (Pong) అనే గేమ్ చిప్ ని మకాక్ (Macaque) జాతికి చెందిన పాజెర్ (Pager)మెదడులో అమర్చారు. నాడీ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లకు ఈ చిప్ మెరుగ్గా పనిచేస్తుందని.. వారు త్వరగా కోలుకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఈ వీడియోపై భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చిప్ ల ను అమర్చి మూగజీవులను వేధించడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వైద్య వైజ్ఞానిక రంగంలో ఇదో అద్భుతమైన ఘట్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Full View