ఇప్పటికే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద సొంత జిల్లా నెల్లూరు ఎమ్మెల్యేలు గరంగరం అవుతూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ తమతో వ్యవహరించే తీరు సరిగా లేదు అనేది వారి నుంచి వినిపించిన మాట. అలాగే సీనియర్లకు కూడా అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా విలువను ఇవ్వడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో ఆయనపై గట్టిగానే అసమ్మతి ఏర్పడిందని మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.
ఆ సంగతలా ఉంటే.. తాజాగా ఈ మంత్రిపై చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు కూడా మండిపడ్డారని సమాచారం అందుతోంది. అనిల్ కుమార్ కీలకమైన ఇరిగేషన్ శాఖకు మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి ముందు తమ అసంతృప్తిని తెలియజేశారట.
చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా ద్వారా - సాగు-తాగు నీరు అందించే విషయంపై పనుల్లో జాప్యం గురించి వారు ప్రశ్నించినట్టుగా సమాచారం. హంద్రీనీవా అనంతపురం దాటి కూడా పూర్తి అయ్యింది. చిత్తూరు జిల్లాలో కూడా ఆ కాలువ చాలా వరకూ పూర్తైంది. అయితే నీటి విడుదల మాత్రం పెద్దగా ఉన్నట్టుగా లేదు. అనంతపురం జిల్లా వరకూ శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు హంద్రీనీవా కాలువ ద్వారా ప్రవహిస్తున్నాయి. అయితే ఆ తర్వాత నీటి ప్రవాహం మందకొడిగా ఉందని తెలుస్తోంది. దీంతో చిత్తూరు జిల్లా అవసరాలకు తగిన రీతిలో నీటి లభ్యత లేదు.
ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ మీద చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు - నేతలు మండిపడుతున్నారట. చిత్తూరు జిల్లా తాగు - సాగునీటి అవసరాలను తీర్చాలని వారు కోరుతున్నట్టుగా తెలుస్తోంది.