అమ్మ..కొడుకుల‌పై అగ‌స్టా పిడుగు!

Update: 2018-12-30 06:06 GMT
అధికారంలో ఉంటే ఏదైనా సాధ్య‌మే. తాజా రాజ‌కీయాల్లో త‌ర‌చూ వినిపిస్తున్న మాట ఇది. ప‌వ‌ర్ ఒక్క‌సారి చేతికి వ‌స్తే చాలు..రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించ‌టం కొత్తేం కాకున్నా.. గ‌తంలో ఎప్పుడూ లేని ల‌క్ష్మ‌ణ రేఖ‌ల్ని దాటేస్తున్న వైనం ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది. త‌మిళ‌నాడు.. ప‌శ్చిమ‌బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో నెల‌కొన్న రాజ‌కీయాల‌కు త‌గ్గ‌ట్లే దేశ రాజ‌కీయాలు మారుతున్నాయి.

పార్టీల మ‌ధ్య భావ వైరుద్యం.. వ్య‌క్తుల మ‌ద్య వ్య‌క్తిగ‌త శ‌త్రుత్వం మాదిరి మారుతున్న దౌర్భాగ్యం దేశ రాజ‌కీయాల్లో అంత‌కంత‌కూ పెరిగేది. తాజాగా నెల‌కొన్న ప‌రిణామాలు  ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయ‌న్న విమ‌ర్శ ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది. లోక్ స‌భ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ‌.. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో జ‌మానా నాటి అగ‌స్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాఫ్ట‌ర్ల కుంభ‌కోణం తెర మీద‌కు వ‌చ్చింది.

గ‌తానికి భిన్నంగా ఈ కేసుకు సంబంధించిన అంశాలు స‌రికొత్త‌గా తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఈ కేసులో మ‌ధ్య‌వ‌ర్తిగా ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బ్రిట‌న్ జాతీయుడు క్రిస్టియ‌న్ మిషెల్ ఈడీకి సోనియా.. రాహుల్ గాంధీల పేర్ల‌ను ప‌రోక్షంగా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని ఈడీ కోర్టుకు కూడా చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

మిషెల్ త‌న‌కు క‌ల్్పించిన న్యాయ సాయాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని.. అత‌డికి బ‌య‌ట నుంచి స‌ల‌హాలు.. సూచ‌న‌లు అందుతున్నాయ‌ని ఈడీ అధికారులు తాజాగా ఢిల్లీ కోర్టుకు చెప్పినట్లుగా చెబుతున్నారు. మిసెస్ గాంధీ గురించి అడిగే ప్ర‌శ్న‌ల‌ను ఎలా బ‌దులు ఇవ్వాలో చెప్పాల‌ని త‌న లాయ‌ర్ల‌కు చీటీలు పంపిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అగ‌స్టాలో గాంధీ కుటుంబ పాత్ర ఉంద‌ని ఈడీ వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తుంద‌ని బీజేపీ చెప్ప‌గా.. విచార‌ణ‌లో గాంధీ కుటుంబ‌స‌భ్యుల పేర్లు చెప్పేలా విచార‌ణ సంస్థ‌లు ఒత్తిడి చేస్తున్న‌ట్లుగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఇదంతా చూసిన‌ప్పుడు.. అగ‌స్టా పిడుగును గాంధీ ఫ్యామిలీపై వేసేందుకు ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్న‌ట్లుగా చెబుతున్నారు. మోడీపై రాఫెల్ మ‌ర‌క అంటిన నేప‌థ్యంలో.. గాంధీ కుటుంబానికి అగ‌స్టా మ‌చ్చ వేయ‌టం ద్వారా లెక్క సరిపోతుంద‌న్న మాట వినిపిస్తోంది. ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చేస్తున్న వేళ‌.. రానున్న రోజుల్లో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉందంటున్నారు.

ఇక్క‌డ చెప్పాల్సిన మ‌రో అంశం ఉంది. సోనియా..  రాహుల్ పేర్ల‌ను ప్ర‌స్తావించ‌ని ఈడీ అధికారులు.. కోర్టుకు త‌మ సందేహాల్ని చెప్పే క్ర‌మంలో ఇట‌లీ మ‌హిళ కొడుకు అని సంబోధించ‌టం గ‌మ‌నార్హం. ఇట‌లీ మ‌హిళ కొడుకు అన్న‌ది ఎవ‌రో కాద‌ని.. సోనియా.. రాహుల్ అని చెబుతున్నారు. మ‌రి.. ఈ వ్య‌వ‌హారం రానున్న రోజుల్లో మ‌రెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?
Tags:    

Similar News