క‌రోనాకు మ‌రో జెనరిక్ మెడిసిన్‌.. త‌క్కువ ధ‌ర‌కే !

Update: 2020-07-10 00:30 GMT
ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విల‌య తాండ‌వం చేస్తోంది. దేశంలో కరోనా వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పేరైగిపోతుంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 7,42,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా వారిలో 4,56,831 మంది భాదితులు కరోనా ను జయించి హాస్పిటల్ నుండి డీఛార్జ్ అయ్యారు. ఇంకా కొంతమంది కరోనాతో పోరాడుతున్నారు. అయితే రోజురోజుకి కరోనా భారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి భాదితుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా కరోనా వైర‌స్ రోగుల కోసం జ‌న‌రిక్ రెమ్‌ డెసివిర్ మెడిసిన్ ‌ని విడుదల చేసింది.

ఆ మెడిసిన్ ను త‌క్కువ ధ‌ర‌కే మార్కెట్లోకి తీసుకుని వ‌చ్చింది ఈ ఫార్మా కంపెనీ. కాగా ఈ జ‌న‌రిక్ మందును డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదించింది. ఇ‌క సిప్రెమి పేరుతో విడుదల చేసిన ఈ జ‌న‌రిక్ మందు ధర‌ రూ.4 వేలు. తొలి నెల‌లోనే 80 వేల వ‌య‌ల్స్ స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

ఈ సందర్భంగా కంపెనీ సీఈవో నిఖిల్ చోప్రా మాట్లాడుతూ..అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు ఈ కరోనా మెడిసిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చాం అని , జ‌న‌రిక్ రెమ్ ‌డెసివిర్ 100 ఎంజీ వ‌య‌ల్ ధ‌ర రూ.4,000 గా నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్ర‌పంచం మొత్తం మీద ఇదే అతి త‌క్కువ ధ‌ర అని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ మెడిసిన్ ను హెటిరో సంస్థ రూ.5,400 కు, మైలాన్ కంపెనీ రూ.4,800 లకు అమ్ముతున్నాయి. అయితే ఈ మెడిసిన్ ప్ర‌స్తుతం కేవ‌లం ప్ర‌భుత్వ ఆసుప‌త్రి మార్గాల ద్వారా మాత్రమే ల‌భిస్తుంది. ఎవరికీ వారు ఇష్టం వచ్చినట్టు ఈ మందుని వాడటం మంచిది కాదు ..డాక్టర్ల సూచనతో ఈ మందుని వాడటం మంచిది.
Tags:    

Similar News