ప్రధాని మోడీకున్న ఆధ్యాత్మిక భావాలు కొందరికి ఆయాచిత వరమవుతోంది. ఆయన సెంటిమెంట్ ను వాడుకుంటూ పైకి రావాలని స్కెచ్ గీశాడు. ఎప్పుడో ప్రధానిని కలిసిన ఫొటోలను వాడి ఫోకస్ చేసుకున్నాడు. చివరకు తాను ప్రధాని సన్నిహితుడినంటూ వ్యవస్థనే మేనేజ్ చేయాలని చూశారు. ఈ విషయం ఏకంగా మోడీకే తెలిసింది. తన పేరు చెప్పుకొని బతుకీడుస్తున్న బాబాను ఆయనే కటకటాలు పాలు చేసిన సంఘటన ఢిల్లీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా బాబా.?
పుల్కిత్ మహారాజ్.. అలియాస్ పుల్కిత్ మిశ్రా.. మంచి కథక్ డ్యాన్సర్. పదిమందికి డ్యాన్స్ నేర్పిస్తూ పొట్టపోసుకునేవాడు. అప్పుడప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజల్లో తానో బాబాను, గురువు అని ఫోకస్ తెచ్చుకున్నారు. దీంతో ఇదే వ్యాపారాన్ని విస్తరించాలని యోచించాడు.
ఏకంగా ప్రధాని మోడీకి ఆధ్యాత్మిక ఓనమాలు నేర్పింది తానేనని.. ఎప్పుడో మోడీతో దిగిన ఫొటోలను చూపించి జనాలను నమ్మించాడు. ఆ ముసుగులోనే ప్రధాని గురువునంటూ ఎక్కడికెళ్లినా వీఐపీ సౌకర్యాలు అందుకున్నాడు. ఇది మరింత శృతి మించి ఏకంగా కల్చరల్ మినిస్ట్రీ సెక్రెటరీ పేరుతో ఓ నకిలీ లెటర్ హెడ్ ను సృష్టించాడు. దాని మీద ‘పుల్కిత్ మహారాజ్ మోడీకి బాగా కావాల్సిన వాడు.. జర బాగా చూసుకోండి’ అని యూపీలోని ఒక కలెక్టర్ కు లేఖ రాశాడు. ఈ లేఖపై అనుమానం వచ్చిన కలెక్టర్ ఏకంగా దాన్ని పీఎంవో ఆఫీసుకు పంపాడు.
మోడీ పేరు చెప్పి రాజభోగాలు అనుభవిస్తున్న పుల్కిత్ పై పీఎంవో అధికారులు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రధాని నుంచి ఆదేశం కావడంతో వెంటనే పోలీసులు విచారించి పుల్కిత్ ను జైలుకు పంపారు. ఇలా మోడీనే వాడుకుందామని చూసిన ఈ నయా బాబాకు చివరకు శ్రీకృష్ణ జన్మస్థానం దిక్కైంది.