అంబానీ ఫ్యామిలీ లండన్ కు షిఫ్ట్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ

Update: 2021-11-06 04:15 GMT
దేశంలోనే అపర కుబేరుడు.. రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంపై గత కొద్దిరోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ 11వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా ముఖేష్ కుటుంబంపై ఓ వార్త ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.

ముఖేష్ అంబానీ కుటుంబం కొన్ని రోజుల్లో ముంబై నుంచి పూర్తిగా లండన్ షిఫ్ట్ కానుందనేది సదురు వార్త సారాంశం. ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. ముకేష్ అంబానీ లండన్ లో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని.. త్వరలోనే ఆ కుటుంబం లండన్ లో సెటిల్ కానున్నారని వెల్లడించింది. ఇక ఇంటి నిర్మాణం గురించి కూడా అనే విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో 50కిపైగా బెడ్ రూంలు, హాల్స్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఒక కోటలా ఉందన్నారు.

అయితే కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంపై రిలయన్స్ తాజాగా స్పష్టమైన ప్రకటన చేసింది. ముఖేష్ అంబానీ లండన్ కు వెళ్లనున్నారనే వార్తలపై మీడియాకు అధికారిక సమాచారం ఇచ్చింది.

జాతీయ పత్రికలు, మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ముఖేష్ అంబానీ క్లారిటీ ఇచ్చారు. ముఖేష్ అంబానీ కుటుంబం ముంబైలోనే ఉంటున్నారని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్వయంగా ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. అంబానీ కుటుంబం లండన్ కే కాదు ప్రపంచంలో మరే చోటుకు వెళ్లడం లేదని స్పష్టం చేసింది.

ఇక లండన్ లోని స్టోక్ పార్క్ ఎస్టేట్ ను ముఖేష్ కొనుగోలు చేసిన విషయంపై కూడా రిలయన్స్ స్పందించింది. ఈ ఎస్టేట్ ను ప్రీమియర్ గోల్ఫింగ్ క్లబ్ తోపాటు క్రీడా రిసార్ట్ గా మార్చాలనే ఉద్దేశంతోనే కొనుగోలు చేశఆమని స్పష్టతనిచ్చింది. లండన్ లోని ఈ ఎస్టేట్ తో ఆతిథ్యరంగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే కొన్నామని రిలయన్స్ ప్రకటించింది.


Tags:    

Similar News