'టీకా' తీసుకున్న సీఎం జగన్ దంపతులు !

Update: 2021-04-01 06:26 GMT
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి కరోనా‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.  గుంటూరు అమరావతి రోడ్డులోని భారత్‌పేట 140వ వార్డు సచివాలయంలో సీఎం జగన్, సతీమణి భారతిలు వ్యాక్సినేషన్ కోసం పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ...  భారత్ ‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్‌ భారతితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కరోనా‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అనంతరం వార్డు,గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ సచివాలయం, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సమావేశమమయ్యారు.  

వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా సీఎం జగన్ , అయన సతీమణి భారతీ కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారు. సీఎం వై ఎస్ జగన్ టీకా తీసుకోవడంతో రాష్ట్రంలో 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనితో అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యాక్సిన్‌ కేంద్రం, వ్యాక్సిన్‌ రూమ్, అబ్జర్వేషన్‌ రూమ్‌ ను హోం మంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ లు‌ బుధవారం పరిశీలించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News