మోడీ సర్కరుపై యుద్ధం చేస్తా.. జాతీయ స్థాయిలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తా.. పలు రాష్ట్రాలకు చెందిన నేతల్ని హైదరాబాద్ కు ఆహ్వానిస్తా.. కొత్త కూటమి ఏర్పాటుకు కసరత్తు చేస్తానంటూ చాలా మాటలు చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు భిన్నంగా చేతలు ఉండటం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల ఫలితాల ఆనంతరం ఆయన ఆలోచనలు మారిపోయినట్లుగా చెబుతున్నారు. అప్పటివరకు తెలంగాణ ప్రజలు తన వెంటే ఉన్నారని.. తానేం చెబితే దాన్నే విశ్వసిస్తారన్న నమ్మకం ఆయనలో ఉండేదని.. గ్రేటర్ ఫలితం అలాంటివాటిని పటాపంచలు అయ్యేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.
ఈ కారణంతోనే జాతీయ స్థాయిలో కూటమి కట్టే ఆలోచనను వదిలేసి.. ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్రమంత్రులతో పాటు.. ప్రధానమంత్రి మోడీతో భేటీ కావటం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఏదో చేస్తానన్న పెద్దమనిషి.. గ్రేటర్ ఫలితం వచ్చీ రాగానే కేంద్రం వద్దకు పరుగులు తీసి.. అదే పనిగా చర్చలు జరపటం వెనుక అర్థమేమిటి? అన్న క్వశ్చన్ ను సంధిస్తున్నారు. కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటన ఆయన ఇమేజ్ ను భారీగా దెబ్బ తీసిందని చెబుతున్నారు.
కేసీఆర్ ఏ మాత్రం నమ్మకస్తుడైన వ్యక్తికాదన్న భావన జాతీయ స్థాయిలో చాలామంది నేతల మాటల్లో వినిపిస్తుందని చెబుతారు. దీనికి తగ్గట్లేతాజా పరిణామాలు చోటు చేసుకోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. కష్టమైనా.. నష్టమైనా.. తాము చెప్పిన దానికి నిలబడాల్సిన అవసరం ఉందని.. ఆ విషయంలో కేసీఆర్ తీరు ఎప్పుడూ నిలకడగా ఉందంటున్నారు.
కేంద్రానికి ధీటుగా కూటమి కట్టే సామర్థ్యం కేసీఆర్ కు ఉంటే.. ఢిల్లీ వెళ్లి ఆ భేటీలు ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సీఎం కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటన ఆయనకు కానీ.. తెలంగాణకు కానీ లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ వాదనలో నిజమెంతన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.