జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ - బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ పేరిట తృతీయ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓ అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నారు. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా వెళ్లిన కేసీఆర్... ఆ రాష్ట్ర సీఎం, జాతీయ రాజకీయాల్లో కీలక పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. వెంట కూతురు, పార్టీ ఎంపీలను వెంటబెట్టుకుని వెళ్లిన కేసీఆర్... తమ బృందానికి మమత చాలా ప్రాధాన్యం ఇచ్చారని, ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం ఊపందుకున్నట్లేనని కలరింగ్ ఇచ్చారు. అయితే ఆ భేటీలో చోటుచేసుకున్న పరిణామాలు కేసీఆర్‌కు తెలియకుండానే లీక్ కావడందో గులాబీ దళం షాక్ తిన్నదనే చెప్పాలి. ఈ షాక్ నుంచి చాలా త్వరగానే తేరుకున్న కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్యలను మరోమారు ప్రారంభించేశారనే చెప్పాలి.
ఇందులో భాగంగా దక్షిణాదికి చెందిన కీలక రాజకీయ వేత్త, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడతో భేటీ అయ్యేందుకు కేసీఆర్ పక్కా ప్లాన్ వేశారనే చెప్పాలి. ఇప్పుడు కన్నడ నాట అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. త్వరలోనే జరగనున్న ఆ ఎన్నికలకు సంబంధించి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో పాటు కన్నడ నాట కీలక పార్టీగా ఉన్న జేడీఎస్ కూడా తమదైన శైలి ప్రచారం సాగిస్తున్నాయి. కన్నడ నాట చక్రం తిప్పగల సామర్థ్యం ఉన్న జేడీఎస్... దేవేగౌడ స్థాపించిన పార్టీనే అన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లోనూ జేడీఎస్ కీలకంగా మారిందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో దేవేగౌడతో చర్చలంటూ కేసీఆర్ బెంగళూరు ఫ్లైటెక్కేశారు. సరిగ్గా కన్నడ నాట ఎన్నికలు జరుగుతున్న వేళ కేసీఆర్ బెంగళూరు టూర్ నిజంగానే ఆసక్తి రేకెత్తించేదేనని చెప్పక తప్పదు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా దేవేగౌడ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తనదైన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించిన గౌడ... ఉత్తరాది నేతలను వెనక్కు నెట్టేసి ప్రదాని పీఠాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల నుంచి దాదాపుగా కనుమరుగైపోయిన గౌడ... కేవలం కన్నడ నాట రాజకీయాల్లోనే కనిపిస్తున్నారు.
అప్పుడప్పుడు మాత్రమే మీడియాలో కనిపిస్తున్న గౌడ... కన్నడ నాట రాజకీయాల్లో మాత్రం తనదైన పాత్రను మాత్రం పోషిస్తూనే ఉన్నారు. మొత్తంగా తృతీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్న వేళ మరోమారు గౌడ ప్రస్తావన వచ్చేసింది. అంటే.... ఫెడరల్ ఫ్రంట్ దిశగా వేస్తున్న ప్రతి అడుగును కేసీఆర్ చాలా జాగ్రత్తగా వేస్తున్నట్లుగా చెప్పక తప్పదు. ఇందుకు నిదర్శనంగా కేసీఆర్ వెంట బెంగళూరు ఫ్లైటెక్కిన బృందమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే కేసీఆర్ వెంట ఫ్లైటెక్కిన వారిలో టీఆర్ఎస్ లో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న ఎంపీ వినోద్, సంతోష్ కుమార్, సుభాష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో పాటు ఇటీవల జాతీయ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్న బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ ఉండటమే, సాధారణంగా సినిమా వాళ్లకు రాజకీయాల్లో అంతగా ప్రాధాన్యం ఇవ్వరన్న వాదన లేకపోలేదు.
ఇలాంటి తరుణంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పరిణామంగా పరిగణిస్తున్న గౌడతో భేటీకి తన వెంట ప్రకాశ్ రాజ్‌ను తీసుకెళుతున్నారంటే నిజంగానే ఆసక్తికరమే. దక్షిణాది భాషా చిత్రాలతో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ సత్తా చాటిన ప్రకాశ్ రాజ్... స్వతహాగా కన్నడిగుడు. ఇటీవలి కాలంలో తరచూ మీడియా ముందుకు వస్తున్న ప్రకాశ్ రాజ్... కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ, ఆ పార్టీ కీలక నేతలు - చివరకు ప్రధాని నరేంద్ర మోదీపైనా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. చాలా పకడ్బందీగానే ప్రకాశ్ రాజ్ చేస్తున్న దాడితో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోందనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో ప్రకాశ్ రాజ్ ను తన వెంట బెట్టుకుని మరీ కేసీఆర్ దేవేగౌడ వద్దకు వెళుతున్నారంటే... ఈ భేటీలో ప్రకాశ్ రాజ్ కీలక భూమిక పోషిస్తున్నారన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్న కేసీఆర్... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో పక్లా ప్లాన్‌తోనే ముందుకు సాగుతున్నట్లుగా చెప్పాలి.