తెలంగాణ సీఎం కేసీఆర్ కు క‌రోనా పాజిటివ్

Update: 2021-04-19 14:05 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి క‌రోనా సోకింది. ల్యాబ్ రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. సీఎం కె చంద్రశేఖర్ రావుకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలంగాణ చీఫ్ సెక్రటరీ అధికారిక నోట్ తెలిపింది.

ప్ర‌స్తుతం ఎర్రవ‌ల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఐసోలేష‌న్ లో ఉన్నార‌ని ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. వైద్యుల బృందం ప్రస్తుతం సీఎం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. కొద్దిరోజుల క్రితం నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్ పాల్గొన్నారు. తెరాస అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కి మ‌ద్ధ‌తుగా ప్ర‌చార స‌భ‌లో పాల్లోన్నారు. నోముల భ‌గ‌త్ కు పాజిటివ్ అని తేలింది.

ఏప్రిల్ 17 న రాత్రి 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 4009 కొత్త కోవిడ్ -19 కేసులు 14 మరణాలు తెలంగాణలో నమోదయ్యాయి. వారాంతంలో అధికారులు తక్కువ పరీక్షలు చేయడంతో కేసుల సంఖ్య 5093 నుండి పడిపోయింది. ఏప్రిల్ 18 రాత్రి 8 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో 83089 పరీక్షలు నిర్వహించగా.. అంతకుముందు రోజు 129637 నమూనాలను పరీక్షించారు. తాజా కేసులు రాష్ట్ర సంచిత సంఖ్య 355433 కు చేరుకోగా మరణాల సంఖ్య 1838 కు చేరుకున్నాయి.

రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిసర జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. రాష్ట్ర రాజధానిలో 705 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ప్రక్కనే ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి.. రంగారెడ్డి జిల్లాలో వరుసగా 363336 కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News