వ‌రుస యాత్ర‌ల మ‌ర్మ‌మేంది కేసీఆర్?

Update: 2018-04-19 08:31 GMT
మిగిలిన ముఖ్య‌మంత్రుల‌తో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తీరు కాస్త భిన్న‌మ‌ని చెప్పాలి. ఆయ‌న‌లో విల‌క్ష‌ణ కోణాలు చాలానే క‌నిపిస్తాయి. ఆయ‌న ఏదైనా అంశం మీద ఆస‌క్తి క‌లిగితే దాని సంగ‌తి చూసే వ‌ర‌కూ వ‌దిలిపెట్టారు. అది పుస్త‌కం కానీ.. ఏదైనా అంశం కానీ. కొత్త విష‌యాల మీద ఆయ‌న చూపే ఆస‌క్తి గురించి ఆయ‌న స‌న్నిహితులు ప్ర‌త్యేకంగా చెబుతుంటారు.

ఇక.. ఆయ‌న మీటింగ్ లు కూడా మిగిలిన వారికి భిన్నంగా ఉంటాయి. అధికారుల‌తో శాఖాప‌ర‌మైన రివ్యూల సంగ‌తే చూస్తే.. చాలామంది ముఖ్య‌మంత్రుల్ని చూసిన సీనియ‌ర్ అధికారులు సైతం కేసీఆర్ రివ్యూను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తారు. అన్నేసి గంట‌ల రివ్యూ ఏందిసార్‌.  ఏం మాట్లాడారు? అంటే.. ఒక్క ముక్క కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒక సీనియ‌ర్ అధికారి మాట్లాడుతూ.. ఆయ‌న మాట్లాడుతూ ఉంటే.. అలా వినేస్తూ ఉంటాం. టైం కూడా తెలీదు. మ‌ధ్య‌లో బ్రేక్ లేకుండా ఆయ‌న చెప్పే మాట‌లు ఒక‌దానికి మించి మ‌రొక‌టి అన్న‌ట్లు ఉంటాయ‌ని పొగిడేస్తుంటారు.

స‌బ్జెక్ట్ మీద చ‌ర్చ కంటే కూడా ఓవ‌రాల్ గా త‌న‌కేం కావాల‌న్న అంశం మీద‌నే కేసీఆర్ మాట‌లు ఉంటాయ‌ని చెబుతారు. ఇలా రివ్యూ స‌మావేశాలు మొద‌లు ప్ర‌తి విష‌యంలోనూ విల‌క్ష‌ణ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొన్ని నెల‌ల త‌ర్వాత నెల‌కు పైనే వ‌రుస‌గా రోజుకో కొత్త ఆలోచ‌న‌ను.. ప‌థ‌కాన్ని ప్ర‌క‌టిస్తూ సంచ‌ల‌నం సృష్టించారు.

అందులో ఎన్నింటిని పూర్తి చేశారు?  మ‌రెన్నింటిని స‌క్సెస్ ఫుల్ గా అమ‌లు చేస్తున్నారు?   లాంటి విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఏదో ఒక‌టి చేయ‌టంలో మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు న‌వ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటారు.తాజాగా ఆయ‌న పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లి వ‌స్తున్నారు. మొన్న‌టికి మొన్న కోల్ క‌తా వెళ్లిన కేసీఆర్‌.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాతో భేటీ కోస‌మ‌ని అంద‌రికి చెప్పారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ చ‌ర్చ కోస‌మ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. ఆ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ప్ర‌ధానంగా కోల్ క‌తా న‌గ‌రంలో కాళీ మాత‌ను సంద‌ర్శించేందుకు ఎక్కువ శ్ర‌ద్ధ చూపిన‌ట్లు చెబుతారు.

ఈ మ‌ధ్య‌నే క‌ర్ణాట‌క‌కు వెళ్లిన ఆయ‌న.. మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ‌తో భేటీ అయ్యారు. అనంత‌రం బెంగ‌ళూరులో ఎక్క‌డికి వెళ్లార‌న్న విష‌యంపై స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. అయితే వ‌చ్చే నెల మొద‌టివారంలో వెళ్లే ఒడిశా టూర్ లో ఆయ‌న వెళుతున్న‌ది ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ను క‌లిసేందుకు.. ఆయ‌న‌తో రాజ‌కీయాలు మాట్లాడేందుకు కాద‌ని.. పూరీ జ‌గ‌న్నాథ టెంపుల్ ను సంద‌ర్శించేందుకేన‌న్న విష‌యాన్ని న‌వీవ్ చెప్పేశారు.

పైకి ఫెడ‌ర‌ల్ బిల్డ‌ప్ ఇచ్చినా.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల్లో దేవాల‌యాల సంద‌ర్శ‌న త‌ప్ప‌నిస‌రిగా ఉండ‌టం గ‌మ‌నార్హం. తాజాగా మ‌హారాష్ట్రకు వెళుతున్న కేసీఆర్ ఫ్యామిలీ.. షిర్డీ సాయినాథుడ్ని సంద‌ర్శించ‌నున్నారు. ఈ రోజు (గురువారం) మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల వేళ‌లో బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానంలో షిర్డీకి వెళుతున్నారు. రాత్రికి అక్క‌డే బ‌స చేసిన ఆయ‌న‌.. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున సాయినాథుని సేవ‌లో త‌రించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి హైద‌రాబాద్‌కు రానున్నారు.

ఇదంతా చూస్తే.. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేనంత‌గా ఆయ‌న ఆల‌యాల సంద‌ర్శ‌న క‌నిపిస్తుంది. ఇదంతా బ‌య‌ట‌కు చెప్ప‌ని మొక్కుల బాకీ తీర్చుకోవ‌ట‌మా?  లేక‌.. ఇంకేదైనా కార‌ణం ఉందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 
Tags:    

Similar News