బయట ప్రపంచంలో పెద్దగా పరిచయం కానీ ముఖ్యమంత్రుల సతీమణుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి శోభ ఒకరు. కొందరు సీఎం సతీమణులకు ప్రజల్లో చక్కటి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అలాంటి వారిలో శోభమ్మ ఒకరు. పెద్దగా బయటకు రాకున్నా.. తన పరిధి మేరకు ఆమె చక్కగా రిసీవ్ చేసుకుంటారని చెబుతారు.
కేసీఆర్ తీరుకు భిన్నంగా ఆమె..తాను పరిచయం ఉన్న వారితో చక్కటి సంబంధాలు మొయిటైన్ చేస్తారని చెబుతారు. తాజాగా ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. వాంతులు.. విరేచనాలు.. ఇతర సమస్యలతో బాధ పడుతునన ఆమెను చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు.
ప్రముఖ వైద్యులు రావు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. గురువారం ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సతీమణి అనారోగ్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పినట్లుగా చెబుతున్నారు.
డయేరియా కారణంగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్ వెంట మంత్రి కమ్ మేనల్లుడు హరీశ్ ఉన్నారు. శుక్రవారం ఉదయం శోభను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.