విశాఖ ముహూర్తం.. జగన్ సంచలన ఆదేశం

Update: 2020-01-07 05:33 GMT
కొత్త సంవత్సరం వేళ సరికొత్త పాలనను విశాఖ నుంచే ప్రారంభించడానికి ఏపీ సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరిపాలన రాజధానిగా విశాఖను చేయడం.. అక్కడ అధికారులు స్థలాలు భవనాలు చూసిన సంగతి తెలిసిందే..

తాజాగా వెంటనే విశాఖ నుంచి పరిపాలన సాగించాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంక్రాంతి పండుగ ముగిశాక విశాఖపట్నం నుంచే పరిపాలన చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

తాజాగా విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఈనెల 20లోగా అద్దె భవనాలు చూసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ (జేఏడీ) ఆయా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలువురు ఐఏఎస్ లు అమరావతి నుంచి విశాఖకు చేరుకొని భవనాలు పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే ముఖ్య అధికారులు వచ్చి విశాఖ లో భవనాలు పరిశీలించారు. విశాఖ లోని మిలీనియం టవర్ ను సచివాలయంగా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. కీలక శాఖలను ముందుగా తరలించి ఆ తర్వాత విడతల వారీగా విశాఖకు శాఖలన్నీ తరలిస్తారు. 20లోగా ఈ తరలింపు పూర్తి చేసి విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి జగన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News