వాతావరణంలో వస్తున్న మార్పులతో పలు దేశాలు సంక్షోభంలో కురుకపోతున్నాయి. ఏం చేయాలో తెలియక చేతులేత్తేస్తున్నాయి. పలు దేశాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడి భయాందోళనకు గురిచేస్తున్నాయని మెటీరియాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో ఎప్పుడు ఎలాంటి ఆపద ముంచుకొస్తుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గడిచిన వారంరోజుల వ్యవధిలోనే అమెరికా - ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విరుద్ధమైన వాతావరణ పోకడలతో అక్కడి ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నాయి. అమెరికాను మంచుదప్పటి కప్పేయగా చాలాచోట్ల మైనస్ 38డిగ్రీలకు పడిపోగా మరికొన్ని చోట్ల ఏకంగా మైనస్ 50కి కూడా పడిపోయిదంటే పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అత్యంత చలిగాలులను భరించలేక 12మంది మృతిచెందినట్లు సమాచారం. వందలాది రైళ్లు - విమానాలను అధికారులు రద్దు చేయగా - స్కూళ్లను మూసివేయించారు. ఇల్లినాయిస్ - విస్ కాన్సిస్ - మిషిగాన్ వంటి దేశాల్లో అక్కడి గవర్నర్లు ఎమర్జన్సీ విధించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.
అమెరికా దేశానికి భిన్నంగా ఆస్ట్రేలియాలో పరిస్థితి మరోరకంగా ఉంది. ఆస్ట్రేలియాలో విపరీతమైన ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అక్కడ ఉష్ణోగ్రత 117డిగ్రీల ఫారెన్ హీట్ కు పెరిగిపోయిందని అంచనా. ఆడిలైడ్ - ఫోర్ట్ ఆగస్టా వంటి నగరాల్లో ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు పెరిగిపోయిందని దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. గత 62ఏళ్లలో ఇంతటి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి అని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
అమెరికా - ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనే కాకుండా పలు దేశాల్లో వాతావరణ మార్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న వేడి, చలితో ప్రజలు సతమవుతున్నారు. ఏదిఏమైనా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆందోళన కలిగించేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో టెక్నాలజీలో ఎంత ముందుకు దూసుకెళుతున్న ప్రకృతి కన్నెర్ర చేస్తే అంతా హుష్ కాకే అని మరోసారి రుజువు చేసినట్లయింది. ఇప్పటికైనా మనిషి టెక్నాలజీని కాకుండా ప్రకృతిని నమ్ముకుంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.