ఐఏఎస్ .. ఈ దేశంలోనే అతి పెద్ద హోదా. వారు ఏం కోరినా క్షణాల్లో వారి ముందు ప్రత్యక్షం అవుతుంది. ఏ తరహా సదుపాయాలు కావాలన్నా కూడా అందుబాటులోకి వస్తాయి. కలెక్టర్లు అయిన వారిలో చాలా మంది దేశానికి ఎనలేని సేవ చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే , కలెక్టర్లలో తలబిరుసు తనంతో ప్రవర్తించే వారూ ఉంటారు. ఏ పని చెయ్యాలన్నా ,నేనేంటి, నే స్థాయేంటి అది చెయ్యడమేంటి అంటూ రివర్స్ అవుతుంటారు. ఆ హోదాను పక్కనపెట్టి తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకొని వార్తల్లో నిలిచారు కర్ణాటకలోని మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి.
తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి సింధూరి తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల క్రితం కొడగు తదితర పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె సొంతంగా కారును డ్రైవ్ చేశారు. మార్గంమధ్యలో టైర్ పంక్చర్ అయ్యింది. ఆమె స్వయంగా రంగంలోకి దిగి, కారు కింద జాకీ అమర్చి టైర్‌ను ఊడదీసి, మరో టైర్‌ను అమర్చారు. రోడ్డుపై వెళ్లేవారు గమనించి మీరు మైసూరు జిల్లా కలెక్టర్ కదా! అని అడగ్గా అవును తానే రోహిణి సింధూరినని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా శుక్రవారం వైరల్ అయ్యాయి. కలెక్టర్ హోదాలో ఉండి కూడా స్వంతంగా కారు టైర్ మార్చుకున్న కలెక్టర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
టైర్ ఫంక్చర్ అయిన సమయంలో ఆమె కలెక్టర్ కాబట్టి ఓ ఫోన్ కొడితే, మరో కారు వచ్చేస్తుంది. అందులో హాయిగా వెళ్లిపోవచ్చు. కానీ ఆమె అలా చెయ్యలేదు. అది అధికారిక పర్యటన కాదు కాబట్టి తన సొంత పని కాబట్టి తానే స్వయంగా కారు కింద జాకీ సెట్ చేసి పంక్చర్ అయిన టైరును ఊడదీసి మరో టైరును సెట్ చేసుకున్నారు. పదవుల్ని అడ్డం పెట్టుకొని... అడ్డగోలుగా అవినీతికి పాల్పడేవారు మన దేశంలో లెక్కలేనంత మంది. ఆమె మాత్రం నిజాయితీగా వ్యవహరించారని నెటిజన్స్ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన రోహిణి సింధూరి 2009 కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారిణి. ఆమె కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుధీర్ రెడ్డిని పెళ్లాడిన రోహిణి ప్రస్తుతం మైసూరు జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోహిణి తెలుగు, కన్నడ, తమిళం, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.
Full View