కొత్త వ్యవసాయ చట్టాలను పరిశీలించేందుకు నియమించిన కమిటీ కేవలం మధ్యవర్తిత్వం కోసమే ఏర్పాటు చేశామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులంతా గతంలో వ్యవసాయ చట్టాలను సమర్థించిన వారే కావడంతో.. ఈ కమిటీ ఏర్పాటు పక్షపాతంగా ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాము కమిటీని మధ్యవర్తిత్వం కోసమే ఏర్పాటు చేశామని, ఇందులో పక్షపాతానికి తావులేదని స్పష్టం చేసింది. తాము నిపుణులం కాదని, అందుకే కమిటీలో నిపుణులను నియమించినట్లు వ్యాఖ్యానించింది ధర్మాసనం. సుప్రీం నియమించిన కమిటీ సభ్యుల్లో ఒకరు తప్పుకున్నందున కమిటీని పునర్నియమించాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది సుప్రీం.
అదేవిధంగా.. గణతంత్ర దినోత్సవం రోజున చేపట్టబోయే ట్రాక్టర్ ర్యాలీపై దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు విచారించింది. ట్రాక్టర్ ర్యాలీ లేదా మరే ఇతర నిరసనలకు వ్యతిరేకంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తద్వారా నిరసన ప్రజల హక్కు అని పరోక్షంగా చెప్పింది ధర్మాసనం. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులే అని సృష్టం చేసింది.