ప్రశాంతంగా ఉన్నట్లుగా కనిపించే కోస్తాలో చాలా విషయాల్లో లోలోన రగులుతుంటాయి. చాలా విషయాలకు మీడియా ఫోకస్ తక్కువ. కొన్ని విషయాలు అయితే.. ఎలా రాయాలో తెలీక.. అనవసరంగా విషయాలను పెద్దవి చేయటం ఇష్టం లేక వదిలేస్తుంటారు. చిన్న చిన్న విషయాలుగా చిత్రీకరించేసి వదిలేసిన దానికి ఇప్పుడు పెద్ద పెద్ద అంశాలుగా మారి శాంతిభద్రతల సమస్య వరకూ వచ్చిందని చెప్పొచ్చు.
చిన్న చిన్న అంశాలకు సినీ.. రాజకీయ ప్రముఖుల అండదండలు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిజానికి ఈ చిన్న చిన్న అంశాలుగా చెప్పే వాటికి సంబంధించి కొన్ని విషయాలు చాలా వింతగా.. విచిత్రంగా కనిపిస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా.. కోస్తా ప్రాంతంలో అడుగు పెట్టిన కొత్తవారికి చాలా విషయాలు వింతగా.. విచిత్రంగా అనిపిస్తాయి. కోస్తా ప్రాంతంలోని కాలేజీలో చేరినా.. లేదంటే.. మరే పని మీద ఎవరితోనైనా మాట కలిపినా.. పరిచయం అయిన పది నిమిషాల్లోనే.. ఇంతకీ మీ కులం ఏమిటన్న మాట చాలా డీసెంట్ గా బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది పల్లెటూళ్ల దగ్గర నుంచి బడా క్యాంపస్ ల వరకూ ఒకటే తీరు. ఇదో చిత్రమైన వ్యవహారంగా కనిపించి.. చాలామంది నాన్ కోస్తా ప్రాంతాలకు చెందిన వారికి జీర్ణించుకోలేనట్లుగా కనిపిస్తుంది.
ఈ వ్యవహారమే చిత్రంగా అనిపిస్తే.. మరికొన్ని వ్యవహారాలు మరింత చిత్రంగా అనిపిస్తాయి. కాలేజీ క్యాంపస్ లలో.. కులం ఆధారంగా సంఘాలు ఉండటం మామూలే. అదే సమయంలో మరోచిత్రమైన ధోరణి కనిపిస్తుంది. ఎక్కడైతే ఫలానా కులం బలమైందో.. బలమైన సామాజిక వర్గం ఒక గ్రూప్ గా.. మిగిలిన సామాజిక వర్గాలన్నీ మరో కులంగా ఏర్పడి.. కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు.
ఇలాంటి చిత్రమైన కల్చర్.. కోస్తాలోని చాలా కాలేజీల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు చౌదరీలు బలంగా ఉండే కాలేజీ క్యాంపస్ లలో (యాజమాన్యం సహా) కమ్మలతో కూడిన గ్రూప్ ఒకటైతే.. నాన్ కమ్మలంతా మరో గ్రూప్ గా ఉంటారు. అసలిలా ఉండటం ఏంటి చిరాగ్గా అని కొత్తగా వీటి గురించి తెలుసుకున్న వారు.. తర్వాత రోజుల్లో వాటిల్లో లోతుగా మునిగిపోతుంటారు.
కోస్తాలోని చాలా ప్రాంతాల్లోని కాలేజీల్లో ఇలాంటి ధోరణి కనిపిస్తుంది. చెబితే నమ్మరు కానీ.. హీరోలు నటించే బ్రాండ్లకు కూడా కులం రంగు పూసేసి.. ఫలానా బ్రాండ్ ఫలానా హీరో అంబాసిడర్ గా ఉన్నాడు కాబట్టి.. సదరు బ్రాండ్ ను మిగిలిన కులస్తులు వాడకూడదన్న ఫర్మానాలు కొన్ని కాలేజీల్లో ఉంటాయి. వినేందుకు ఆశ్చర్యంగా
.. ఎటకారంగా అనిపించినా.. కోస్తాలోని కాలేజీలతో పరిచయం ఉన్న వారికి ఈ విషయాలు కొత్తగా అనిపించవు.
అంతదాకా ఎందుకు తమ అభిమాన హీరోను కులం ఆధారంగా చాటి చెప్పుకోవటమే కాదు.. సినిమా విడుదలను తమ కుల ఆధిపత్యంగా భావించి.. అందుకు తగ్గట్లు భారీ ఏర్పాట్లు చేసుకునే ధోరణి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి అన్ని కులాలకు ఉంటుందా? అంటే.. పైన చెప్పినట్లుగా.. స్థానికంగా బలమైన సామాజిక వర్గం ఒక జట్టుగా.. మిగిలిన సామాజిక వర్గాలన్నీ మరో జట్టుగా ఉండి కథను నడిపిస్తుంటాయి.
ఇలాంటి ధోరణి కారణంగానే.. తమ సామాజిక వర్గానికి చెందిన కథానాయకుడు సినిమా విడుదల అయ్యిందంటే.. భారీ సంఖ్యలో అద్దెకార్లను టోకుగా అద్దెకు తీసుకొని.. పెద్ద ర్యాలీ నిర్వహించటమే కాదు.. దీన్ని కాలేజీ క్యాంపస్ వద్ద కు తీసుకెళ్లి.. అక్కడ భారీ కేక్ కట్ చేసి.. ఇవే కార్లు ధియేటర్ల వరకూ ర్యాలీగా వెళ్లే చిత్రమైన కల్చర్ ఇరవైఏళ్లకు పూర్వమే ఉంది.
అంతేకాదు.. కోస్తాలోని కొన్ని ప్రముఖ కాలేజీ (ప్రభుత్వ క్యాంపస్ లలో) వసతి గృహాల్లో కులం ఆధారంగా రూమ్ కేటాయింపులు ఉండటం కోస్తాతో సంబంధం లేని వారు నమ్మలేని నిజం. హాస్టల్ లో గదుల కేటాయింపు కూడా.. స్థానికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులందరిని ఒకటే గదులలో బస ఏర్పాటు చేయటం.. అందులో ఏదైనా ఖాళీ ఉంటే.. నాన్ కాంట్రవర్షియల్ కులాలకు చెందిన వారికి ఇవ్వటం చేస్తుంటారు. నాన్ కాంట్రావర్షీయల్ అంటే సామాజికంగా కాస్త సున్నితంగా వ్యవహరించే కులాలన్న మాట. ఆయా సామాజిక వర్గాలకు చెందిన కులాల వారు గొడవలకు.. కొట్లాటలకు వెళ్లకుండా నోరు మెదపకుండా ఉండే వారికి కేటాయిస్తారు. మరీ.. ఇంత దారుణంగా ఉంటుందా? అని అనుకోవచ్చు కానీ.. కోస్తాతో పరిచయం ఉన్న వారిని ఒక్కసారి ఆరా తీస్తే.. విషయాలు వరుసగా బయటకు వస్తాయి. కోస్తాలో ఎడ్యుకేషన్ హబ్ గా పిలుచుకునే ప్రాంతాల్లో పరిస్థితి.. ఆయా ఊళ్లల్లోని క్యాంపస్ లో ఉండే కుల రాజకీయం గురించి విన్నప్పుడు.. ఔరా కోస్తాలో మరీ ఇంత కులాభిమానం ఉంటుందా? అని షాక్ తినే పరిస్థితి.
అదొక్కటే కాదు.. కొన్ని క్యాంపస్ లలో ఉండే కొన్ని గేమ్ టీంలలో కొన్ని కులాలకు చెందిన వారే టీం సభ్యులుగా ఉంటారు. అదేమని అడిగితే అదో సంప్రదాయమని చెప్పటమే కాదు.. కాదన్న వారిపై మూకుమ్మడిగా దాడి చేయటానికి సైతం వెనుకాడరు. 2000 ఏడాదికి ముందు కోస్తాలోని ఒక ప్రముఖ విద్యా సంస్థలో బాస్కెట్ బాల్ టీంలో అత్యధికులు ఒక సామాజిక వర్గానికి చెందిన వారే టీంమెంబర్లుగా ఉన్న పరిస్థితి. దాన్ని ప్రశ్నించి.. పోరాటం చేయటమే కాదు.. విషయం సీరియస్ అయి.. ఈ అంశంపైసదరు జిల్లా ఎస్పీని కలవటానికి విద్యార్థి నాయకులు కొందరు వెళ్లారు.
అయితే.. ఆ విద్యార్థి నేతలకు ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే.. సదరు ఎస్పీ సైతం అదే క్యాంపస్ లో తానూ చదివినానని.. ఆ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని.. ఇప్పుడు కాదని గొడవ చేసి..లేని పోని ఇష్యూలు తెచ్చుకునే కన్నా.. కామ్ గా కోర్సు చేసి వెళ్లిపోవచ్చుగా అని చెప్పి పంపారట. బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వొచ్చుగా అని సలహా ఇవ్వటంతో కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్లిన విద్యార్థులు షాక్ కు గురయ్యారు.
ఇక్కడ ఎస్పీని తప్పు పట్టలేం. ఎందుకంటే.. సదరు క్యాంపస్ లో కులాభిమానం ఎక్కువగా ఉండటేమే కాదు.. దాన్ని ఎదుర్కొంటే ఎన్ని ఇబ్బందులో అక్కడ చదివిన విద్యార్థిగా ఆయనకు తెలుసు. అందుకే.. గొడవ చేయించి.. కేసులు.. గట్రాలతో కెరీర్ ను దెబ్బ తీసుకునే కన్నా.. ముక్కు మూసుకున్నట్లుగా కోర్సు పూర్తయ్యే వరకు ఉండాలని హితబోధ చేసి.. కుల చట్రంలోకి చిక్కుకోవద్దని సలహా ఇచ్చారంటారు.
చట్టప్రకారం తాను చర్యలు తీసుకునే వీలున్నా.. తాను చర్యలు తీసుకుంటే.. మొదట టార్గెట్ అయ్యేది సదరు విద్యార్థులేనని.. తాను అన్ని వేళలా కాపాడలేనని.. స్థానికంగా కొంతకాలం మాత్రమే ఉండి వెళ్లటానికి వచ్చిన విద్యార్థులు లేనిపోని విషయాల్లోకి వెళ్లొద్దని.. ఇలాంటివి ముదిరితే రాజకీయ నేతలు ఎంటర్ అవుతారని.. అప్పుడు విద్యార్థులు ఏకాకులు అవుతారని.. ఇవన్నీ తాను ప్రాక్టికల్ గా ఆలోచించి చెబుతున్న అంశాలని సుదీర్ఘంగా చెప్పటంతో సదరు విద్యార్థి నేతలు కూడా సమాధాన పడి కామ్ గా తిరిగి వెళ్లిపోయారట. ఇలాంటివెన్నో కుల సిత్రాలు కోస్తాలో కనిపిస్తాయి.
కొన్ని ప్రైవేటు క్యాంపస్ లలో అయితే.. రిక్రూట్ మెంట్ మొత్తం కూడా కులం ఆధారంగా ఉంటుందన్న ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. ఉదాహరణకు ఎ అనే బలమైన కులానికి చెందిన యాజమాన్యంలో నడిచే కాలేజీలో.. అధ్యాపకుల దగ్గర నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ వరకూ ‘‘ఏ’’ కులానికే పెద్దపీట వేస్తారు. మిగిలిన కులాల వారు ఉంటారు కానీ.. చాలా నామమాత్రంగా కనిపిస్తారు.
ఇలాంటి వైఖరి వల్లే.. కొన్ని కాలేజీల్లో ఇంటర్నల్ మార్కులు 90 నుంచి వంద శాతం తెచ్చుకునే విద్యార్థులు.. ఫైనల్ పరీక్షల్లో మాత్రం రెండు నుంచి నాలుగైదు సబ్జెక్ట్ ల వరకూ ఫెయిల్ అయ్యే పరిస్థితి. నిజానికి ఇంటర్నల్ మార్కులు అంత బ్రహ్మాండంగా వచ్చినప్పుడు.. పరీక్షల్లో మాత్రం అన్ని సబ్జెక్ట్ లలో ఎందుకు ఫెయిల్ అయ్యారన్న మాట ఎవరు ప్రశ్నించరు? ఏ ప్రభుత్వ సంస్థ నిలదీయదు.