కరోనా కల్లోలం నుంచి ఉద్యోగులకు కోతలే తప్పితే జీతాలు పెంచే అవకాశమే లేకుండా పోయింది. కరోనా పేరు చెప్పి ఇప్పటికీ జీతాల్లో 10 నుంచి 30 వరకూ కోసేస్తూనే ఉన్నాయి. అలాంటి దుర్భర కంపెనీలున్న ఈ కాలంలో ఓ మహానుభావుడు ఉద్యోగుల పాలిట నిజంగానే దేవుడిగా మరాడు. ఆ ఉద్యోగులందరూ ఆ కంపెనీ బాస్ ను అలానే కొలుస్తున్నారు. జీతాల పెంపుపై హామీలిచ్చి మరీ ఎగ్గొడుతున్న ఈరోజుల్లో ఏకంగా ఉద్యోగుల కోసం ఇంత చేసిన ఆ కంపెనీ యజమానిని మెచ్చుకోవాల్సిందే మరీ..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్.. ప్రతి ఇళ్లల్లో ఈడుకొచ్చిన వారికి పెళ్లి సంబంధాలు చూస్తూ చేసేస్తున్నారు. తల్లిదండ్రులంతా అదే పనిలో ఉన్నారు. పెళ్లిళ్ల పేరయ్యలు, మ్యాట్రిమోనీలను సంప్రదిస్తున్నారు. అయితే ఇక్కడొక సాఫ్ట్ వేర్ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు తీపికబురును అందించింది. అదిప్పుడు వైరల్ గా మారింది.
తమిళనాడులోని మధురైలో ఉన్న శ్రీమూకాంబికా ఇన్ఫో సొల్యూషన్స్ అనే సంస్థ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సదురు కంపెనీ ఫౌండర్, సీఈవో సెల్వగణేష్ తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఏడాదికి రెండు సార్లు ఇంక్రిమెంట్ ఇస్తామని తెలిపారు. అదేవిధంగా సరైన పెళ్లికానికి వారికి సరైన సంబంధాలను చూడడానికి కంపెనీలో ప్రత్యేక విభాగాన్ని ఆయన ఏర్పాటు చేసి గొప్ప పుణ్యం కట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటే కూడా ప్రత్యేకమైన ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించారు.
2006లో శివకాశిలో ప్రారంభమైన ఈ సాఫ్ట్ వేర్ కంపెనీ క్రమంగా వృద్ధి చెంది 2010కి మధురైకి మార్చబడింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని సీఈవో తెలిపారు.
ఇలాంటి ఇంక్రిమెంట్లు, పెళ్లి సంబంధాలు చూడడం వల్ల ఉద్యోగులు ఇతర కంపెనీలకు మారాలన్న ఆలోచనలను మానుకుంటారని.. కంపెనీని ఓన్ చేసుకొని పనిచేస్తారని సీఈవో చెబుతున్నారు. దానివల్ల తమ సంస్థ ఎదుగుతోందని అంటున్నారాయన.. ఉద్యోగులకు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఇంక్రిమెంట్స్ ఇస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఈ సాఫ్ట్ వేర్ కంపెనీలో 40శాతం ఉద్యోగులు సుమారు ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఉద్యోగులలో పనిపట్ల నిబద్ధత, కంపెనీ పట్ల గౌరవం పెరుగుతాయని.. దీంతో ఉత్పాదక పెరుగుతుందని సీఈవో చెబుతున్ానరు. ఇలాంటి యజమాని ఒక్కరుంటే చాలు ఆయన వద్ద పనిచేయడం మేలు అని చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.