వైసీపీలో నేతల మధ్య పరోక్ష యుద్ధం సాగినట్టు తెలిసింది.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పకుండా విమర్శలు చేసుకున్నట్టు నియోజకవర్గంలో కోడై కూస్తున్నారు.. ప్రశాశం జిల్లా వైసీపీలో ఆధిపత్యపోరు ఇప్పుడు సెగలు రేపుతున్నట్టు సమాచారం. ఇద్దరు వైసీపీ నేతలే అయినా ప్రత్యర్థుల్లా కొట్లాడుకుంటున్నట్టు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఇద్దరూ కలిసి ఉన్నట్లే కనిపించినా తాజాగా జగన్ పుట్టినరోజు వేడుకల్లో వీరి విభేదాలు బయటపడ్డట్టు ప్రచారం సాగుతోంది.. ఎవరికి వారు సొంతంగా బర్త్ డే జరపడంతో అంతర్గతంగా ఉన్న విభేదాలు రచ్చకెక్కాయని నియోజకవర్గంలో అనుకుంటున్నారు.
ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి తాజాగా పంచ్ డైలాగులు పేల్చి సవాల్ చేశారు. సాఫ్ట్ వేరోడు సాఫ్ట్ గా ఉంటాడనుకున్నారా? ఆ సాఫ్ట్ వెనుక బండరాయంత గుండె ఉంది అంటూ తన ప్రత్యర్థి పేరు పలుకకుండా పంచులేశాడని చెబుతున్నారు.
దీనికి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. క్యాడర్‌ని గాలికొదిలేసి పారిపోయిన నీకు పెత్తనం కావాలా అంటూ విమర్శించినట్టు సమాచారం.
ఇలా దర్శిలో అటు ఎమ్మెల్యే వేణుగోపాల్.. ఇటు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిలు వేర్వేరు కార్యక్రమాలతో పేరు ఎత్తకుండా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారని నియోజకవర్గంలో వాతావరణం వేడెక్కిందని ప్రచారం సాగుతోంది.