లోక్ సభ ఎన్నికలు.. కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వానికి గండం తెచ్చి పెట్టాయి. బీజేపీ పతనమే లక్ష్యంగా జత కట్టిన కాంగ్రెస్ – జేడీఎస్ కు లోక్ సభ ఎన్నికలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నట్లుగా సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేపీ 'ఆపరేషన్ కమల' చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అయితే గత విధాన సభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ (113) రాకపోవడంతో కాంగ్రెస్ – జేడీఎస్ జతకట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆరంభం నుంచి 'సంకీర్ణం' లో గుబులు నెలకొంటోంది. ఫలితంగా బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ కాంగ్రెస్ అసమ్మతి నేతలతో టచ్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో లోక్ సభ ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని పదేపదే వ్యాఖ్యానిస్తున్న బీజేపీ నాయకుల మాటలు నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంది. 2018 విధానసభ ఎన్నికల్లో బీజేపీ 104 - కాంగ్రెస్ 80 - జేడీఎస్ 37 - ఇతరులు ముగ్గురు గెలిచారు. ఎవరికీ ఆధిక్యం లేకపోవడంతో కాంగ్రెస్ - జేడీఎస్ జత కట్టాయి. జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి సీఎం అయ్యారు. ఆరంభంలో కాంగ్రెస్ 80 - జేడీఎస్ 37 - ఇతరులు ముగ్గురు కలిపి ప్రభుత్వానికి 120 మంది ఎమ్మెల్యేల బలం ఉండేది. అయితే ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్ - హెచ్.నగేశ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ తరఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు లోక్ సభ బరిలో ఉన్నారు. మరో ఎమ్మెల్యే మరణించారు. ఇంకా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల అనంతరం కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ నేతలు పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీకి ప్రస్తుతం 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి బీజేపీలో చేరే అవకాశం ఉంది. చించోళి ఎమ్మెల్యే ఉమేశ్ జాదవ్ కాంగ్రెస్ కు రాజీనామా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే నెలలో చించోళి - కుందగోళ స్థానాలకు ఉప ఎన్నిక ఉంది. అదేవిధంగా బ్యాటరాయునిపుర ఎమ్మెల్యే కృష్ణభైరేగౌడ - భాల్కి ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్రే లోక్ సభ బరిలో ఉన్నారు. వారు ఎంపీలుగా గెలిస్తే ఆ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. ఆ నాలుగు స్థానాల్లో బీజేపీ గెలిస్తే 113 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అదేవిధంగా కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు మహేశ్ కుమటళ్లి - గణేశ్ - నాగేంద్ర కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.