ప్ర‌తిప‌క్ష పార్టీకి వ‌రుస పంచ్‌ లు

Update: 2016-05-29 09:50 GMT
గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరొంది కాంగ్రెస్ పార్టీకి ఘోర ప‌రాభావం. తాజాగా జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు తోడు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ మ‌రో అవ‌మానాన్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. తొలిసారిగా ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రాతినిథ్యం లేని పరిస్థితి దాపురించింది.2014లో జ‌రిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోగా పెద్ద‌ల స‌భ ఎన్నిక పంచ్ ఇచ్చింది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఉన్న చిదంబరం వంటి ఎంద‌రో సీనియర్ నేతలు ఉన్నా తమిళ తంబీ లు కాంగ్రెస్ పార్టీని 2014 ఎన్నిక‌ల్లో ఆదరించలేదు. దీంతో ఒక్క ఎంపీ కూడా గెల‌వ‌లేక‌పోయింది. తాజాగా రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను గెలుచుకుంది. అయితే ఆ పార్టీ మిత్రపక్షం డీఎంకే 89 సీట్లను దక్కించుకుంది. ఈ బలంతో డీఎంకే పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. అయితే కాంగ్రెస్‌-డీఎంకే క‌లిసి కూట‌మిగా పోటీ చేసిన‌ప్ప‌ట‌కీ ఈ రెండు సీట్లకు తన పార్టీ నేతలనే ప్రకటించిన డీఎంకే కాంగ్రెస్‌ కు అవకాశం కల్పించలేదు. దీంతో అటు లోక్‌ సభలోనే కాకుండా ఇటు రాజ్యసభలోనూ తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సభ్యుడూ లేకపోవడమ‌నే రికార్డును కాంగ్రెస్ సాధించిన‌ట్లయింది.
Tags:    

Similar News